మ్యాటర్ ఉంటే ఛాన్సులిలా ఉంటాయ్!
అయితే రణవీర్ కోసం ప్రశాంత్ ఎలాంటి కథ సిద్దం చేసాడు? అన్నది ఆసక్తికరం. ప్రశాంత్ సినిమాలన్నీకాన్సెప్ట్ ఓరియేంటెడ్ గానే ఇప్పటివరకూ తెరకెక్కించాడు.
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ తో పనిలేదని ప్రూవ్ చేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' పాన్ ఇండియాలో ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల వసూళ్లను సాధించి రికార్డు సృష్టించారు. ఈ రేంజ్లో హిట్ అవుతుందని ప్రశాంత్ సైతం ఊహించి ఉండడు. హనుమాన్ కాన్సెప్ట్ ఇండియా వైడ్ ఆ స్థాయిలో కనెక్ట్ అయింది. ఇప్పుడా నమ్మకంతోనే ఏకంగా బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు.
ఇప్పటి వరకూ ఆ కాంబినేషన్ అనేది ప్రచారం గానే వినిపించినా ఇప్పుడా కాంబో దాదాపు సెట్ అయినట్లేనని సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుందని సమాచారం.
అయితే రణవీర్ కోసం ప్రశాంత్ ఎలాంటి కథ సిద్దం చేసాడు? అన్నది ఆసక్తికరం. ప్రశాంత్ సినిమాలన్నీకాన్సెప్ట్ ఓరియేంటెడ్ గానే ఇప్పటివరకూ తెరకెక్కించాడు. చిన్న చిన్ననటుల తోనే సినిమాలు చేసాడు.
తొలిసారి రణవీర్ లాంటి స్టార్ తోడవ్వడంతో అతని కోసం ఎలాంటి కథ రాసాడు? అన్నది ఆసక్తికరం. రణవీర్ ఇమేజ్ ని బేస్ చేసుకున్నాడా? లేక తన పంథాలోనే కథసిద్దమైందా? అన్నది తెలియాలి. ఈ చిత్రాన్నిపాన్ ఇండియాలో చేసే అవకాశం ఉంది. హిందీలో తెరకెక్కించి 'యానిమల్' తరహాలో ఊపు తీసుకొచ్చి అన్ని భాషల్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఈ సినిమా అనంతరం ప్రశాంత్ వర్మ 'హనుమాన్' కి కొనసాగింపు గా 'జై హనుమాన్' తెరకెక్కిస్తాడు. ఇందులో హీరో ఎవరు? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.
మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ కథలో నటించడానికి ఆసక్తిగానే ఉన్నారు. ఇప్పటికే ఆయన ఆసక్తిని వెల్లడించారు. అలాగే నటసింహ బాలకృష్ణ యువ దర్శకుడిలో ట్యాలెంట్ని హనుమాన్ రిలీజ్ కి ముందే పసిగట్టి సినిమా చేస్తానన్నాడు. బాలయ్య కోసం ప్రశాంత్ స్టోరీ కూడా సిద్దం చేసి పెట్టుకున్నాడు. రణవీర్ సినిమా అనంరతం బాలయ్య తో చేసే అవకాశం ఉంది. అలాగే ప్రశాంత్ యూనివర్శ్ నుంచి మరిన్నిసినిమాలు రానున్నాయి. అదీ టాలీవుడ్ లో ట్యాలెంట్కి ఉన్న క్రేజ్.