ఆరేళ్ల విరామం తర్వాత..కెరీర్ లో తొలి సవాల్!
`దిల్ సే` నుంచి `రబ్ నే బనాదీ జోడీ` వరకూ ప్రతీ జింటా కెరీర్ బాలీవుడ్ లో ఎలా సాగిందో చెప్పాల్సిన పనిలేదు.
`దిల్ సే` నుంచి `రబ్ నే బనాదీ జోడీ` వరకూ ప్రతీ జింటా కెరీర్ బాలీవుడ్ లో ఎలా సాగిందో చెప్పాల్సిన పనిలేదు. నటిగా ఓ వెలుగు వెలిగిందక్కడ. ఇదే క్రమంలో టాలీవుడ్ లో సైత అంతే ఫేమస్ అయింది. చేసింది కొన్ని సినిమాలే అయినా ఓ ఐడెంటిటీని వేసేసి వెళ్లిపోయింది. అయితే పదేళ్ల కాలంగా ప్రీతీ జింటా మునుపటిలా సినిమాలు చేయలేదు. ఏడాదికి ఒక సినిమా చొప్పున చేసుకుంటూ వచ్చింది. గత ఆరేళ్లగా అయితే పూర్తిగా వెండి తెరకే దూరమైంది.
సినిమా అనే ప్రపంచాన్ని వదిలేసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లే చెప్పాలి. వ్యాపార, వ్యక్తిగత విషయాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వడంతో అమ్మడు ఈ రకమైన జీవనంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రతీ జింటా మళ్లీ ఆరేళ్ల గ్యాప్ అనంతరం `లాహోర్ 1947` అనే సినిమాతో కంబ్యాక్ అవుతోంది. సన్నిడియోల్ ప్రధాన పాత్రలో రాజ్ కుమార్ సంతషి తెరకెక్కిస్తోన్న చిత్రమిది. స్టార్ హీరో అమీర్ ఖాన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ప్రీతి జింటాకి సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది.
ఈ విషయాన్ని ప్రీతి అభిమానులతో పంచుకుంది. విజయవంతంగా నా పాత్ర చిత్రీకరణ పూర్తయింది. సినిమా అద్భుతంగా వస్తోంది. నా జీవితంలో ఇప్పటివరకూ నేను నటించిన ప్రాజెక్ట్ లన్నింటికంటే కఠినమైన సినిమా? ఏది అంటే ఈ సినిమా పేరే చెబుతాను. అంత పెద్ద సవాల్ విసిరిన రోల్ ఇందులో చేసాను. ప్రతీ షాట్ ఎంతో కఠినంగా అనిపించింది. ఎలాంటి పాత్ర అయినా సెట్స్ కి వచ్చేసరికి రెండు, మూడు రోజుల్లో అలవాటైపోతుంది.
కానీ ఈ పాత్ర మాత్రం రోజ్ సవాల్ గానే అనిపించింది. ఇదొక గొప్ప ఎక్స్ పీరియన్స్ ని అందించింది. అభిమానులందరికీ నచ్చే సినిమా` ఇది అని అన్నారు. ఓ సినిమా గురించి ప్రతీ జింటా ఇలా మాట్లాడి చాలా కాలమవ్వడంతో అభిమానులకు కొత్తగా ఉంది. ఇదంతా నిజమేనా? అంటూ ఆశ్చర్యపోతున్నారు.