అప్పుడు ఆ హీరోనే సీఏం రాసిపెట్టుకోండి!
కోలీవుడ్ నటుడు ప్రేమ్ గీ అమరేన్ సుపరిచితమే. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు.
కోలీవుడ్ నటుడు ప్రేమ్ గీ అమరేన్ సుపరిచితమే. నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. తనదైన మార్క్ హాస్యంతో ప్రేక్షకుల్ని నవ్విస్తాడు. ముఖ్యంగా దర్శకుడు వెంకట్ ప్రభుకి స్నేహితుడిలా మెలుగుతాడు. నాగచైతన్య హీరోగా నటించిన `కస్టడీ` సినిమాలోనూ నటించాడు. తాజాగా రిలీజ్ అయిన `ది గ్రేటేస్ట్ ఆఫ్ ఆల్ టైమ్` లోనూ నటించాడు. తాజాగా విజయ్ పొలిటికల్ కెరీర్ పై ప్రేమ్ గీ అమరేన్ ధీమా వ్యక్తం చేసాడు.
`నా ఓటు విజయ్ కే అంటూ బాహాటంగా ప్రకటించాడు. 2026 విజయ్ సీఎం అవుతాడని అన్నారు. రాజకీయంలో రాణించగల సమర్దుడు విజయ్ అని అలాంటి వారు రాజకీయాలకు ఎంతైనా అవసరం అన్నారు. నటులుగా అజిత్, విజయ్ అంటే ప్రేమ అని, కానీ ఆల్ టైమ్ ఫేవరేట్ మాత్రం రజనీకాంత్ అని అన్నారు. అయితే ఇటీవలే విజయ్ చేసిన పొలిటికల్ వ్యాఖ్యలపై రజనీకాంత్ మండిపడిన సంగతి తెలిసిందే.
నేరుగా విజయ్ పేరుగానీ, అతడి పార్టీ పేరుగా పెట్టకుండా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తన మద్దతు డీఎంకే పార్టీకే ఉంటుందని స్టాలిన్ , అతని వారసత్వాన్ని కొనియాడారు. దీంతో అంతవరకూ సైలెంగా ఉన్న రజనీ కూడా ఓపెన్ అయినట్లు అయింది. ఇలా కోలీవుడ్ నుంచి నటులు తమ అభిమాన నాయకుల గురించి ఓపెన్ అవ్వడం సంచలనంగా మారింది. ఏపీ తరహాలోనే కోలీవుడ్ లో కూడా రాజకీయం అంటే ఆసక్తి ఉన్న నటులు చాలా మంది ఉన్నారు.
విశాల్ రాజకీయాల్లో లేకపోయినా? నిజ జీవితంలో మాత్రం రకరకాల అంశాలపై తమిళనాట పోరాటం చేయడం ఆయనకు అలవాటు. ముంబై సెన్సార్ బోర్డ్ తో సైతం విశాల్ చేసిన పోరాటం తెలిసిందే. అలాగే మరికొంత మంది నటులు ప్రత్యక్షంగా పార్టీలకు మద్దతివ్వకపోయినా పరోక్షంగా మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటారు.