సలార్ కన్నా ముందే విలనిజం చూపిస్తాడా..?

ఆయన చేసిన సినిమాలు అక్కడ సూపర్ హిట్ కాగా కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ అవుతూ వచ్చాయి.

Update: 2024-03-30 23:30 GMT

ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ లో వరద రాజమన్నార్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన విషయం తెలిసిందే. మలయాళంలో తన మార్క్ ప్రయోగాలు చేస్తూ నటుడిగా దర్శకుడిగా సత్తా చాటుతున్న పృథ్వీరాజ్ బయట సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అంతకుముందు తెలుగు, తమిళ సినిమాల్లో వెరైటీ పాత్రలు చేసిన పృథ్వీరాజ్ ఈమధ్య పూర్తిగా మలయాళ పరిశ్రమ మీదే దృష్టి పెట్టాడు. ఆయన చేసిన సినిమాలు అక్కడ సూపర్ హిట్ కాగా కొన్ని సినిమాలు తెలుగులో రీమేక్ అవుతూ వచ్చాయి.


లాస్ట్ ఇయర్ సలార్ 1 తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ 2 లో తన విలనిజం చూపించనున్నాడు. సలార్ 1 లో దేవ, వరద రాజ మన్నార్ ఫ్రెండ్ షిప్ చూపించగా సలార్ 2 లో వీరిద్దరి మధ్య వైరం చూపించనున్నారు. సలార్ 2 లో పృథ్వీరాజ్ విలనిజం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది. అయితే సలార్ 2 కన్నా ముందే పృథ్వీరాజ్ తన విలనిజం చూపించబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన బడే మియా చోటే మియా సినిమాలో పృథ్వీరాజ్ నటించారు. అలీ అబ్బాస్ జాఫర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. ఏప్రిల్ 12న రిలీజ్ అవుతున్న బడే మియా చోటే మియా సినిమాపై బీ టౌన్ లో ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది.

సినిమాలో తన పాత్ర గురించి రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పిన పృథ్వీరాజ్ బడే మియా చోటే మియా లో తను చేసిన కబీర్ పాత్రకు చాలా ప్రత్యేకత ఉంది. సినిమాలో ఆ రోల్ లేకుంటే అసంపూర్ణంగా ఉంటుంది. మలయాళంలో హీరోగా చేస్తున్న తాను మిగతా భాషల్లో బలమైన పాత్రల్లో నటిస్తున్నాను. ఎవరు ఏ పాత్ర చేసినా అందరు కృషి చేసేది సినిమా సక్సెస్ అవ్వడం కోసమే అంటున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్.

మలయాళంలో తాను చేసిన కురితి సినిమాలో అసలైతే తాను విలన్ గా చేయాలి కానీ కథ కోసం డైరెక్టర్ తనని హీరోని చేశాడని చెప్పారు. స్టోరీ బాగుంటే ఎలాంటి పాత్రలో అయినా తాను నటించేందుకు సిద్ధమని అంటున్నాడు పృథ్వీరాజ్. రీసెంట్ గా పృథ్వీరాజ్ నటించిన ది గోట్ లైఫ్ ఆడు జీవితం సినిమా రిలీజైంది. ఆ సినిమా కోసం పృథ్వీరాజ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. పాత్ర కోసం ఏం చేసేందుకైనా సిద్ధం అయ్యే అరుదైన నటుల్లో పృథ్వీరాజ్ ఒకరు. అందుకే ఆయన కోసం కొత్త కొత్త పాత్రలు సృష్టిస్తున్నారు.

Tags:    

Similar News