2008 లో అనుకుంటే 2024 లోనా!
మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతటి ట్యాలెంటెడ్ అన్నది చెప్పాల్సిన పనిలేదు
మలయాళం నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతటి ట్యాలెంటెడ్ అన్నది చెప్పాల్సిన పనిలేదు. మాలీవుడ్ లో పెద్ద స్టార్ గా నీరాజనాలు అందుకుంటోన్న అతను ఇటీవల దర్శకుడిగానూ మెగాఫోన్ పట్టిన సంగతి తెలిసిందే. 'లూసిఫర్' అనే తొలి సినిమాతోనే దర్శకుడిగా భారీ విజయం అందుకుని స్టార్ మేకర్స్ కి ఏమాత్రం తగ్గలేదు. అటుపై 'బ్రో డాడి' అనే మరో చిత్రాన్ని తెరకెక్కించి మరో విజయం ఖాతాలో వేసుకున్నా డు. ప్రస్తుతం హ్యాట్రిక్ పై కన్నేసాడు. నటుడిగా వివిధ భాషల్లోనూ ఎన్నో సినిమాలు చేసాడు.
'సలార్' లో వరదరాజ్ మన్నార్ పాత్రతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యాడు. ప్రయోగాత్మక పాత్రలు వెనుకాడని నటుడు. తాజాగా బ్లెస్సీ దర్శకత్వంలో 'ది గోట్ లైఫ్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ప్రచార చిత్రాలతో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదే చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ అందిస్తుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ ఇప్పటి నుంచి కాదు ఏకంగా 16 ఏళ్ల క్రితం నుంచి అనుకుంటోన్న సినిమా ఇప్పటికీ సాద్యమైంది అన్న విషయాన్ని మేకర్స్ రివీల్ చేసారు.
2008 నుంచి ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారుట. అప్పుడే చేసి రిలీజ్ చేయాల్సిన సినిమాని 2024 లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా కోసం పృథ్వీరాజ్ చాలా శ్రమించినట్లు తెలుస్తోంది. పాత్రలో ట్రాన్సపర్మేషన్ కోసం ఏకంగా 31 కేజీలు బరువు తగ్గాల్సి వచ్చిందిట. మొదట బరువు పెరగడం...తర్వాత తగ్గడం అన్నది సవాల్ తో కూడుకున్న పని అని అన్నారు.
90వ దశకంలో గల్ప్ దేశాలకు వలస వెళ్లిన నజీబ్ నిజ జీవిత కథని బెన్యామీన్ గోట్ డేస్ పేరుతో ఓ నవల రచించారు. 2008లో ప్రచురితమైంది ఆ నవల. అప్పటి నుంచి ఆ కథని సినిమాగా తీయాలని ప్లాన్ చేసుకుంటే ఇప్పటికీ సాధ్యమైంది. ఈ కథని సినిమాగా తీయడానికి కేరళ దర్శక-నిర్మాతలు సీరియస్ గానే ప్రయత్నించారుట. ఆ బుక్ రైట్స్ కోసం చాలా శ్రమించారుట. కానీ చివరిగా హక్కులు మాత్రం బ్లెస్సీకి దక్కడంతోనే సాధ్యమైంది.