డైరెక్టర్ అట్లీ భార్య కొత్త వ్యాపారం బావుందే
కథానాయికలు ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదుగుతుండడం నేటి ట్రెండ్.
కథానాయికలు ఎంటర్ప్రెన్యూర్లుగా ఎదుగుతుండడం నేటి ట్రెండ్. కేవలం కథానాయికలు మాత్రమే కాదు, ఇండస్ట్రీలో పలు విభాగాల్లో పని చేస్తున్న ప్రముఖులు కూడా ఎంటర్ ప్రెన్యూర్ షిప్ క్వాలిటీస్‌తో దూసుకుపోతున్నారు. చాలా మంది ఫ్యాషన్ రంగంలో రాణిస్తున్నారు. పలువురు సినిమాలకు కాస్ట్యూమర్లుగాను ఎదుగుతున్నారు.
ఇక స్టార్ హీరోయిన్లు సమంత, సోనమ్ కపూర్ సహా పలువురు కథానాయికలు వస్త్ర శ్రేణి వ్యాపారంలో చాలా కాలంగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే. సొంత బ్రాండ్లతో వీళ్లంతా మార్కెట్లలో అగ్రపథంలో దూసుకెళుతున్నారు. ఇప్పుడు ఇదే తీరుగా తెలివైన ప్రణాళికతో ముందుకు సాగుతోంది తమిళ అగ్ర దర్శకుడు అట్లీ భార్యామణి ప్రియా అట్లీ.
నటిగా, చలనచిత్ర నిర్మాతగా సుపరిచితురాలైన ప్రియా అట్లీ వ్యవస్థాపకురాలుగాను దూసుకుపోయే ప్లానింగ్ తో ఉంది. తాజాగా తన కొత్త డిజైనర్ దుస్తుల బ్రాండ్ `రెడ్ నాట్`ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది ఫ్యాషన్ పరిశ్రమలో తమ అభిరుచిని విస్తరించే ఆలోచన అని ప్రియా చెబుతోంది. రెడ్ నాట్ బ్రాండ్ పురుషులు మహిళలు ఇద్దరి కోసం. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ లలోను ఇవి అందుబాటులో ఉండనున్నాయి.
సినిమాలతో పాటు, ఫ్యాషన్ రంగంలోను ప్రియా అట్లీ ఎదిగే ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికోసం భారీ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రతి అంశంలో కళాత్మకతను నింపే సామర్థ్యంతో ముందుకు సాగుతానని ప్రియా తన సొంత బ్రాండ్ ప్రారంభ ప్రకటనలో తెలిపింది. రెడ్ నాట్ కలెక్షన్స్ అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.