కల్కి తరహాలో డార్లింగ్ లో కూడా గెస్ట్ రోల్స్
కల్కి పార్ట్ 2లో నేచురల్ స్టార్ నాని, నవీన్ పొలిశెట్టి గెస్ట్ రోల్స్ చేస్తారని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.
కల్కి 2898ఏడీ మూవీ సక్సెస్ ఫుల్ గా థియేటర్స్ లో కొనసాగుతోంది. ఈ సినిమాలో చాలా మంది సెలబ్రెటీలు గెస్ట్ రోల్స్ లో కనిపించారు. చిన్న చిన్న పాత్రలే అయిన కూడా ప్రేక్షకులకి బాగా రిజిస్టర్ అయ్యాయి. దర్శకదిగ్గజం రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ లాంటి వారు మూవీలో కనిపించారు. కల్కి పార్ట్ 2లో నేచురల్ స్టార్ నాని, నవీన్ పొలిశెట్టి గెస్ట్ రోల్స్ చేస్తారని నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు.
సినిమాలో గెస్ట్ రోల్స్ చేయించడానికి రీజన్ ఏంటనేది నాగ్ అశ్విన్ చెప్పాడు. మనకి తెలిసిన వారిని తెరపై ఏదో ఒక క్యారెక్టర్ లో చూస్తే ఆడియన్స్ లో ఓ స్మైల్ క్రియేట్ అవుతుందని, దానికోసం నేను గెస్ట్ రోల్స్ కి ప్రాధాన్యత ఇస్తానని నాగ్ అశ్విన్ చెప్పారు. ఇదిలా ఉంటే బలగం మూవీతో హీరోగా సక్సెస్ అందుకున్న ప్రియదర్శి డార్లింగ్ మూవీతో మరోసారి లీడ్ రోల్ లో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది.
తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కావాల్సినంత ఫన్ జెనరేట్ చేసింది. అశ్విన్ రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శికి జోడీగా నభా నటేష్ నటించింది. మూవీ ట్రైలర్ చూస్తుంటే ఆమె క్యారెక్టర్ కి ఎక్కువ స్కోప్ ఉన్నట్లు కనిపిస్తోంది. మల్టీపుల్ పర్సనల్ డిజాస్టర్ ఉన్న అమ్మాయిగా ఈ చిత్రంలో నభా నటేష్ కనిపించింది. రెండు డిఫరెంట్ షేడ్స్ లో తన పాత్రతో చూపిస్తోంది.
పెళ్లి చేసుకొని భార్యతో హనీమూన్ కి ఇటలీ వెళ్లాలని కలలుగానే యువకుడిగా ప్రియదర్శి ఈ చిత్రంలో కనిపిస్తున్నాడు. పెళ్లి తర్వాత అతను భార్యతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది కథలో భాగంగా ఉండబోతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కల్కి తరహాలోనే కొంతమంది ఆర్టిస్ట్స్ ని గెస్ట్ రోల్స్ కోసం తీసుకున్నారంట. అయితే వారెవరనేది ట్రైలర్ లో రివీల్ చేయలేదు.
మూవీ రిలీజ్ తర్వాత థియేటర్స్ లోనే ఆ సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ని చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవ్వాలని సస్పెన్స్ మెయింటేన్ చేస్తున్నారంట. అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మూవీ ఉండటంతో కచ్చితంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. జులై 19న ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ హిట్ మూవీ టైటిల్ తో వస్తోన్న ఈ సినిమా కూడా అదే తరహాలో సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి.