చెన్నై భామ లక్ బాగుందే..!

మలయాళ, కన్నడ భామలకే కాదు చెన్నై భామలకు కూడా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

Update: 2024-08-30 11:26 GMT

మలయాళ, కన్నడ భామలకే కాదు చెన్నై భామలకు కూడా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అప్పటి త్రిష నుంచి సమంత వరకు చెన్నై నుంచి హీరోయిన్ వస్తుంది అంటే స్టార్ హీరోయిన్ గా అవుతుందా అనే చర్చ మొదలవుతుంది. అలా చెన్నై నుంచి వచ్చి మొదటి రెండు సినిమాలు జస్ట్ ఓకే అనిపించుకున్నా థర్డ్ మూవీతో సూపర్ హిట్ అందుకుంది ప్రియాంక మోహన్. కోలీవుడ్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన టైం లోనే నాని తో గ్యాంగ్ లీడర్ ఆఫర్ అందుకుంది అమ్మడు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేదు.

ఐతే నాని హీరోయిన్ గా కొంతమేరకు పాపులారిటీ అయితే సాధించింది ప్రియాంక. ఇక ఆ తర్వాత శర్వానంద్ తో శ్రీకారం సినిమాలో నటించింది. ఆ సినిమా పూర్తిగా నిరాశ పరిచింది. తెలుగులో కష్టం అనుకుని కోలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ వచ్చింది. ఐతే శివ కార్తికేయన్ తో ప్రియాంక మోహన్ చేసిన వరుణ్ డాక్టర్, డాన్ సినిమాలు సక్సెస్ అయ్యాయి. వాటి తెలుగు డబ్బింగ్ వెర్షన్ వల్ల తెలుగులో కూడా సక్సెస్ అందుకుంది ప్రియాంక. ఇక ఆఫ్టర్ లాంగ్ టైం నానితో సరిపోదా శనివారం ఛాన్స్ అందుకుంది.

వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా గురువారం రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఐతే ఈ సినిమా కన్నా ముందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓజీ సినిమా కమిటైంది ప్రియాంక. ఆ బ్యానర్ లోనే సరిపోదా శనివారం కూడా చేసింది. సరిపోదా శనివారం సినిమా చూసిన వారు ప్రియాంక స్పెషాలిటీ ఏంటో మరోసారి గుర్తించారు. ఈ తరం భామల్లా గ్లామర్ షో, పొట్టి డ్రెస్సులు వేసుకోకుండా చాలా పద్ధతిగా కనిపిస్తుంది ప్రియాంక.

అందుకే ఆమెకు వరుస ఛాన్సులు రావట్లేదని తెలుస్తున్నా తన పంథా ఇంతే అని వచ్చిన సినిమానే చేస్తూ ఉంది అమ్మడు. ఐతే సరిపోదా లాంటి హిట్ పడింది కాబట్టి కచ్చితంగా ప్రియాంకకు మరిన్ని ఛాన్సులు వస్తాయని చెప్పొచ్చు. నెక్స్ట్ పవర్ స్టార్ ఓజీ సినిమా కాబట్టి అది కూడా మాక్సిమం హిట్ అనే లెక్క వేసుకోవచ్చు. సో ఓజీ కూడా రిలీజ్ అయ్యాక ప్రియాంక తెలుగులో బిజీ హీరోయిన్ గా మారే ఛాన్స్ కచ్చితంగా ఉంటుందని చెప్పొచ్చు. సో కాస్త వెయిట్ చేసినా అమ్మడు మళ్లీ తెలుగులో బిజీ అయ్యేలా లక్ కలిసి వస్తుంది.

Tags:    

Similar News