తిండిలోను ప్ర‌తిభావ‌ని ఈ న‌టి.. ఇదిగో ప్రూఫ్‌

గ్లోబ‌ల్‌స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలో భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి నివ‌శిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2024-10-21 04:46 GMT

గ్లోబ‌ల్‌స్టార్ ప్రియాంక చోప్రా అమెరికాలో భ‌ర్త నిక్ జోనాస్ తో క‌లిసి నివ‌శిస్తున్న సంగ‌తి తెలిసిందే. పుట్టిల్లు ముంబై కాబ‌ట్టి, అమెరికా టు ముంబై ప్ర‌యాణాల‌తో బిజీగా ఉంటోంది. ఇండియాలో ఏ పండుగ లేదా ఫంక్ష‌న్ ఉన్నా వెంట‌నే అమెరికా నుంచి వ‌చ్చేస్తోంది. అలా ముంబైలో అడుగు పెట్ట‌గానే అస‌లు ర‌చ్చ మొద‌ల‌వుతుంది.

ముఖ్యంగా ప్రియాంక చోప్రా ఉన్న కొద్ది రోజుల్లోనే ముంబైలో లేదా ఇంకేదైనా న‌గ‌రంలో ఈవెంట్‌లకు హాజరు కావడం, ముంబై వాతావరణాన్ని ఆస్వాధించడాన్ని కొన‌సాగిస్తుంది. ముఖ్యంగా రుచికరమైన ఆహారాన్ని ఆస్వాధించ‌డం త‌న‌కు అల‌వాటు. తాజాగా ప్రియాంక చోప్రా తన ముంబై విజిట్ కి సంబంధించిన పీక్ ని ఇన్ స్టాలో షేర్ చేసింది. ముంబైలో త‌న షికార్లు, ఆస్వాధ‌న‌ల‌కు సంబంధించిన ఈ ఫోటోల‌కు అంద‌మైన‌ క్యాప్షన్ ఇచ్చింది. ``పూర్తి క్యాలెండర్, క‌చ్చితంగా… కానీ ఇది చిన్న విషయాలు కూడా (కన్నీళ్లను ఆపుకునే ఎమోజి)``అని వ్యాఖ్య‌ను జోడించింది.

గ‌త‌ బుధవారం నాడు భారతదేశానికి వచ్చిన ప్రియాంక చోప్రా కేవలం రెండు రోజుల్లోనే అనేక కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ శనివారం ఉదయం భార‌త‌దేశం నుంచి తిరిగి అమెరికాకు వెళ్లిపోయింది. కానీ ముంబైలో ఉన్న‌ప్పుడు పీసీ తన చిత్రం `పానీ` ప్రివ్యూకు హాజరయ్యారు. అనంత‌రం రుచికరమైన ఆహారాన్ని ఎలా తింటుందో ఆవిష్క‌రించే ఓ ఫోటోగ్రాఫ్ ని కూడా ఇన్ స్టాలో షేర్ చేసింది. అయితే ఈ ఫోటో చూడ‌గానే పీసీ మ‌రీ ఇంత తిండిబోతునా? అంటూ కొంద‌రు నెటిజ‌నులు కామెంట్ చేస్తున్నారు. ``బాగా తిన‌డం త‌ప్పు కాదు.. ఉన్న‌త‌మైన‌ అభిరుచి`` అని కూడా కొంద‌రు అభిమానులు ప్ర‌శంసిస్తున్నారు. అంతేకాదు అమెరికా కోడ‌లు పీసీ మంచి వంటగ‌త్తె.. అందుకే అన్నిర‌కాల ఆహారాల‌ను భుజించ‌గ‌ల‌దు! అని కూడా కొంద‌రు విశ్లేషిస్తున్నారు.

ప్రియాంక చోప్రా ముంబైలో కొద్దిరోజులే ఉన్నా కానీ ఆ స‌మ‌యంలో భారతీయ, చైనీస్, ఇటాలియన్ వంట‌కాల‌ను ఆర‌గిస్తుందిట‌. రుచికరమైన ఆహారాన్ని అస్స‌లు వ‌దిలిపెట్ట‌దు. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుంటే గంట‌ల కొద్దీ స‌మ‌యం ప‌డుతుంద‌ని కూడా ఈ ఫోటోగ్రాఫ్ చెబుతోంది.

Tags:    

Similar News