ఫోటో స్టోరి: ఈ కవర్ పేజీలో లేడీ నిర్మాతలు వెరీ స్పెషల్
ఆయన వారసురాళ్లు సినీరంగంలో ప్రవేశించాక ఆ లెగసీని ముందుకు నడిపించడం అంత సులువగా కుదరలేదు.;

దశాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలిన మెగా నిర్మాతగా అశ్వనిదత్ కి మంచి పేరుంది. ఆయన వారసురాళ్లు సినీరంగంలో ప్రవేశించాక ఆ లెగసీని ముందుకు నడిపించడం అంత సులువగా కుదరలేదు. కానీ అన్ని సవాళ్లను అధిగమించి తండ్రి లెగసీని ముందుకు నడిపించిన ప్రియాంక దత్ - స్వప్న దత్ తెలుగు సినిమాను గర్వపడేలా చేసారనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం, కల్కి 2898 AD లాంటి బ్లాక్ బస్టర్ల వెనుక ఈ జోడీ సృజనాత్మక సహకారం గుర్తించదగినది. తమ దర్శకరచయితలు, ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు వారు క్రియేటివ్ ఫ్రీడమ్ ని ఇచ్చారు గనుకనే.. అభిరుచితో వైవిధ్యమైన కంటెంట్ ని ఎంపిక చేసారు కనుకనే వారికి ఈ గుర్తింపు దక్కింది. నిర్మాతలుగా ప్రియాంక దత్-స్వప్న దత్ ల ప్రతిభను ప్రఖ్యాత మీడియాలు గ్రహించాయి. భారతీయ సినీపరిశ్రమలో గొప్ప ఫిలింమేకర్స్ గా దత్ వారసురాళ్ల పనితనాన్ని కీర్తించేందుకు ఇప్పుడు ది హాలీవుడ్ రిపోర్టర్ ముందుకు వచ్చింది.
జోయా అక్తర్, అలియా భట్, నయనతార లాంటి దిగ్గజాల సరసన వినోద పరిశ్రమలో ప్రారంభ మహిళా శక్తుల జాబితాలో స్వప్న దత్- ప్రియాంక దత్ చోటు సంపాదించారు. `ది హాలీవుడ్ రిపోర్టర్` ప్రకారం.. టాలీవుడ్ నుంచి ఈ జాబితాలో చోటు సంపాదించిన అరుదైన నిర్మాతలుగా స్వప్నాదత్- ప్రియాంక దత్ గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ యువకిశోరాలు కేవలం కొన్ని చిత్రాలను మాత్రమే నిర్మించినా.. అపారమైన అనుభవం ఘడించారు. తమదైన గొప్ప అభిరుచి, సినిమాలపై ఫ్యాషన్ తో వారు ఈ రంగంలో రాణించారు. చాలా తక్కువ సమయంలోనే ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దుల్కర్ సల్మాన్, నేచురల్ స్టార్ నాని, విజయ్ దేవరకొండ వంటి పెద్ద స్టార్లతో కలిసి పనిచేశారు. పాన్ ఇండియా స్థాయిలో దత్ కుమార్తెలు కీర్తిని పొందడం తెలుగు సినిమాకు గర్వకారణం. మునుముందు దత్ సిస్టర్స్ మరిన్ని విజయాలను సాధించి భారతీయ సినీపరిశ్రమలో ప్రత్యేకత ఉన్న నిర్మాతలుగా స్థిరపడతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ప్రభాస్, కమల్ హాసన్ అభిమానులు కల్కి 2898 ఏడి సీక్వెల్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు.