హీరోయిన్ పై బె*డ్ రూమ్ సీన్స్ 20 నిమిషాలు కట్!
కన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు నాని `గ్యాంగ్ లీడర్` తో టాలీవుడ్ కి పరిచయమైంది.
కన్నడ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు నాని `గ్యాంగ్ లీడర్` తో టాలీవుడ్ కి పరిచయమైంది. అటుపై కొంత గ్యాప్ అనంతరం ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ `ఓజీ` చిత్రం లోనే ఛాన్స్ అందుకుని సంచలనమైంది. ఇదే సమయంలో మరోసారి నాని `సరిపోదా శనివా రం`లో అవకాశం కల్పించాడు. ఆ రకంగా ప్రియాంక పేరు కొన్ని నెలలుగా టాలీవుడ్ లో బాగానే మారుమ్రోగుతుంది.
పైగా అమ్మడు అందం..అభినయం గల నాయిక కావడంతో నెట్టింట భారీగానే ఫాలోయింగ్ సంపాదిం చింది. ఇంకా తమిళ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. ఆ రకంగా మొత్తంగా ప్రియాంక కెరీర్ గ్రాప్ లో అన్ని డీసెం ట్ రోల్స్ కనిపిస్తున్నాయి. కానీ ఇంకాస్త గతంలోకి వెళ్తే పీసీ ఆరంభంలోనే చిచ్చర పిడుగులా చెలరేగిందని నిర్మాత ఫిర్యాదుతో వెలుగులోకి వస్తోంది. తమిళ్ లో అమ్మడు `టిక్ టాక్` అనే ఓ చిత్రంలో నటించింది.
ఇదే ప్రియాంక తొలి చిత్రంగా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది. అయితే `డాక్టర్` అనే సినిమా కూడా చేసింది. ముందుగా డాక్టర్ రిలీజ్ అవ్వడంతో ఇదే డెబ్యూ అనుకున్నారు. కానీ నటిగా ప్రయాణం మొదలు పెట్టింది టిక్ టాక్ తోనట. ఆసినిమాలో అమ్మడు హీరోతో కలిసి ఇంటిమేట్ సన్నివేశాల్లో ఓ రేంజ్ లో చెలరేగింది. బె*డ్ రూమ్ సీన్లు కు సైతం ప్రియాంక వెనకడుగు వేయలేదని..దర్శకుడి డిమాండ్ మేరకు అన్ని రకాల సన్నివే శాల్లోనూ నటించిందిని తెలుస్తోంది.
ఇటీవలే రిలీజ్ అయిన ట్రైలర్ తో ఆసన్నివేశాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇప్పుడా సినిమాలో ఆ సీన్లు లేవు. దీంతో నిర్మాత కోర్టులో కేసు వేయడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ప్రియాంకతో ఆ సినిమా మూడు కోట్లకు పైగా వెచ్చించి తీసానని..కానీ ఇప్పుడు తన సినిమాలో ఆ సీన్లు తనకు తెలియకుండా తొలగించడంపై మండిపడుతున్నాడు. 2017 లోనే ప్రియాంక తో అగ్రిమెంట్ జరిగిందని..సినిమా ఆలస్య మవ్వడంతో...ఈలోపు ఆమె ఫేమస్ అవ్వడంతో ఇప్పుడు వాటిని తొలగించడంపై చట్టపరమైన చర్యలకు సిద్దమవుతున్నట్లు సమాచారం. మొత్తం సినిమా అలాంటి సన్నివేశాలపై 20 నిమిషాల కట్ ఉందని నిర్మాత అంటున్నాడు.