అనధికారిక నిషేధంతో చిక్కుల్లో టాప్ హీరోయిన్
బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేస్తున్న సినిమాలు భారతదేశంలో తెరకెక్కుతున్నాయి
భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటి.. 6 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు వచ్చినా అవకాశాలు అందుకున్న నటి.. అనూహ్యంగా కొందరితో శత్రుత్వం కారణంగా బాలీవుడ్ నుండి గెంటివేయబడిన నటి.. ఇటీవల హిందీ పరిశ్రమలో తనకు సినిమాల్లేవ్. కేవలం ఆంగ్ల చిత్రాల్లో మాత్రమే నటిస్తూ పబ్బం గడిపేస్తోంది. ఇక్కడ గ్రేట్ కంబ్యాక్ కోసం ప్రయత్నించి విఫలమవుతోంది. అయితే సోషల్ స్టాటస్ పరంగా ప్రపంచంలోనే రిచెస్ట్ హీరోయిన్ల జాబితాలో తన పేరు ఉంది. ఇంతకీ ఎవరా నటి? అంటే.. నిస్సందేహంగా అది ప్రియాంక చోప్రా మాత్రమే.
బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేస్తున్న సినిమాలు భారతదేశంలో తెరకెక్కుతున్నాయి. దీనికి తగ్గట్టుగానే తారలు తమ ఫీజులుగా భారీ మొత్తాన్ని వసూలు చేయడం చూస్తున్నాం. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా ప్రియాంక చోప్రా పేరు మార్మోగుతోంది. ప్రతి చిత్రానికి రూ.40 కోట్లు వసూలు చేస్తుందని కథనాలొచ్చాయి. చాలా చిన్న వయసులోనే కెరీర్ ప్రారంభించి ఇప్పుడు ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన అందాల భామ బాలీవుడ్ లో ఔట్ సైడర్ గానే ప్రవేశించి నిలదొక్కుకుంది. కెరీర్ ఆరంభం అందిలానే చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనే కాకుండా పాశ్చాత్య దేశాలలో కూడా భారీ అభిమానులను సంపాదించుకుంది. ఇప్పుడు పాప్ గాయకుడు నిక్ జోనాస్ ని పెళ్లాడి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది.
ప్రపంచ సుందరి టైటిల్‌ను గెలుచుకున్న తర్వాత 2003లో ప్రియాంక చోప్రా భారీ బ్లాక్ బస్టర్ తో సినీఎంట్రీ ఇచ్చింది. సన్నీ డియోల్- ప్రీతి జింటాతో కలిసి అనిల్ శర్మ 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై' చిత్రంతో పీసీ బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఇది ఆ సమయంలో అత్యధిక వసూళ్లు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఆ తర్వాత అందాజ్, ముజ్సే షాదీ కరోగి, ఐత్రాజ్, క్రిష్, డాన్ (షారూఖ్) వంటి అనేక హిట్ సినిమాల్లో నటించింది. అయితే ఆ తర్వాత వరుస ఫ్లాప్ చిత్రాలతో నిరాశపడింది.
2007లో ప్రియాంక చోప్రా 6 బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇవ్వడంతో కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంది. సల్మాన్ ఖాన్‌తో కలిసి సలామ్-ఇ-ఇష్క్‌లో నటించింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఆ తర్వాత చేసిన 5 చిత్రాలు బిగ్ బ్రదర్, లవ్ స్టోరీ 2050, గాడ్ తుస్సీ గ్రేట్ హో, చమ్‌కు , ద్రోణ కూడా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. అయితే దీని తరువాత మధుర్ భండార్కర్ 'ఫ్యాషన్'లో నటించింది. ఆ చిత్రం అఖండ విజయం సాధించడమే గాక అవార్డులు రివార్డులు దక్కించుకుంది. వరుస పరాజయాల తర్వాత ఫ్యాషన్ తో కంబ్యాక్ అవ్వడంపై ప్రియాంక చోప్రా ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పింది. ''నేను ఒక సినిమాని నా భుజాలపై వేసుకున్నాను.. ఎందుకంటే ఇది నా కెరీర్‌ను నిర్వచించేదిగా మారింది.. నేను చాలా భయపడ్డాను... మేము ఆ స్క్రిప్ట్‌పై ఆరు నెలల పాటు పని చేసాం'' అని తెలిపింది.
నిజానికి ఫ్యాషన్ విఫలమైతే తన కెరీర్ ముగిసిపోతుందని ప్రజలు తనను హెచ్చరించారని కూడా పీసీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హీరోయిన్లు తమ కెరీర్ చివరిలో ఉన్నప్పుడు సినిమా విషయంలో బాధ్యత తీసుకుంటారు.. ఎందుకంటే వారికి మేల్ తో పని రాదు.. ఈ చిత్రం పరాజయం పాలైతే నాకు వేరే ఉద్యోగం రాదని అందరూ నాతో చెప్పారు! అని కూడా అంది. ప్రియాంక చోప్రా తన కెరీర్ ప్రారంభంలో తనను కూడా గెంటి వేసారని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.. నా స్థానంలో వేరొకరిని భర్తీ చేసారు.. ఇలా రెండుసార్లు జరిగింది.. ఒకసారి ఒక సహనటుడు నాకు చెప్పారు.. ఒకసారి నేను వార్తాపత్రికలో చదివాను. నేను వెళ్లి మా నాన్నగారి దగ్గర ఏడ్చాను.. కానీ నేను దాని తర్వాత ఏం చేయాలో అతడు నాకు చెప్పాడు. నేను నా తదుపరి చిత్రంలో అద్భుతంగా నటించాలని, నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలని అనేవారు. సినిమా బాగా లేకున్నా, నేను చేసేది అద్భుతంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు! దీంతో తన పరిస్థితులకు బాధితురాలిగా ఉండకూడదని పీసీ నిర్ణయించుకుంది.
అయితే ఇన్ని కష్టాలు ఎదురైనా కానీ, ప్రియాంక చోప్రా భారతీయ సినిమాలో తనదైన ముద్ర వేయగలిగింది. తరువాత హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బేవాచ్, లవ్ ఎగైన్, ది వైట్ టైగర్ వంటి సినిమాల్లో నటించింది. యాక్షన్ సిరీస్ సిటాడెల్‌లో కూడా కనిపించింది. IMDb కథనం ప్రకారం, ప్రియాంక చోప్రా ప్రతి చిత్రానికి రూ. 15 కోట్ల నుండి రూ. 40 కోట్లు వసూలు చేస్తుంది. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా రికార్డుల్లో నిలిచింది. పీసీ ఇప్పుడు రూ. 620 కోట్ల నికర ఆస్తి విలువను కలిగి ఉంది. USలో ప్రస్తుతం తన భర్త నిక్ జోనాస్, కుమార్తె మాల్టీ మేరీతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తోంది. అమెరికా లాస్ ఏంజెల్స్ (LA) లో ఒక విలాసవంతమైన ఇల్లును కలిగి ఉంది. దీని ధర రూ. 144 కోట్లు.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. ప్రియాంక చోప్రా తన హాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఇటీవల అమెరికన్ వెబ్ సిరీస్ 'సిటాడెల్'లో తన యాక్షన్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తదుపరి అమెరికన్ చిత్రం 'లవ్ ఎగైన్'లో పీసీ కనిపించింది. పాపులర్ స్టార్ సామ్ హ్యూగన్‌తో పీసీ కెమిస్ట్రీ ఇప్పటికే ప్రేక్షకులను ఆకర్షించింది. అలాగే తదుపరి చిత్రం 'హెడ్స్ ఆఫ్ స్టేట్' షూటింగ్‌లోను ప్రియాంక బిజీగా ఉంది. ఈ చిత్రంలో ఇద్రిస్ ఎల్బా , జాన్ సెనాతో కలిసి స్క్రీన్‌ను షేర్ చేస్కుంటోంది. ఇందులో దేశాధినేతగా కనిపించనుంది. బాలీవుడ్ చిత్రం జీ లీ జరాలో కూడా కనిపించనుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం లో ఈ చిత్రం 2019 లో ప్రకటించారు. అయితే, ప్రియాంక చోప్రా కాల్షీట్ల సమస్య కారణంగా ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. ఈ చిత్రం ముగ్గురు అమ్మాయిల మధ్య స్నేహం నేపథ్యంలో ఆసక్తికర కథాంశంతో తెరకెక్కనుంది. అలియా భట్, కత్రినా కైఫ్, ప్రియాంక ప్రధాన పాత్రలలో నటించనున్నారు. మరోవైపు బిజీ షెడ్యూళ్లతో కీలకమైన కుటుంబ ఫంక్షన్లకు పీసీ హాజరు కాలేకపోతోంది. కాల్షీట్ల సమస్య కారణంగా ప్రియాంక చోప్రా తన కజిన్ పరిణీతి చోప్రా పెళ్లిని కూడా మిస్సయిన సంగతి తెలిసిందే.