పారితోషికంలో గేమ్ ఛేంజర్ ఈ దేశీ గాళ్
గ్లోబల్ మార్కెట్లో హవా సాగిస్తున్న దేశీ గాళ్ ప్రియాంక చోప్రా ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 40 కోట్ల వరకు వసూలు చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో షో సిటాడెల్ కోసం 40 కోట్లు వసూలు చేసింది.
ఫలానా హీరోయిన్ 2 కోట్లు అందుకుంటోంది.... 3 కోట్లు అందుకుంటోంది..! అని మాత్రమే వినేవాళ్లం. కానీ ఆ రోజులు పోయాయి. ఇప్పుడు అగ్ర కథానాయికలు 10-20 కోట్ల మధ్య పారితోషికాలు అందుకుంటున్నారు. కెరీర్ ప్రారంభించి రెండు మూడు హిట్లు కొడితే చాలు 2-4 కోట్ల రేంజ్ పారితోషికాలు అందుకుంటున్నారు ఆ క్రేజ్‌తో. కేవలం డజను సినిమాల్లో నటించిన జాన్వీ కపూర్, అరడజను సినిమాల్లో నటించిన అనన్య పాండే లాంటి కథానాయికలే 5 కోట్లు అంతకుమించి పారితోషికాలు అందుకుంటున్నారు.
అయితే భారతదేశంలో ఒక్కో సినిమాకి 40 కోట్లు అందుకుంటున్న ఏకైక కథానాయికగా ప్రియాంక చోప్రా ఒక సెన్సేషన్. మాజీ మిస్ ఇండియా.. విశ్వసుందరిగా కిరీటాన్ని గెలుచుకుని నటనలో కెరీర్ ని ప్రారంభించి.. మూడు దశాబ్ధాల పాటు అజేయంగా ఏలిన పీసీ వ్యక్తిగత జీవితంలోను ఎంతో హ్యాపీగా ఉంది. నేడు బాలీవుడ్ టు హాలీవుడ్ సత్తా చాటిన ప్రియాంక చోప్రా భారతదేశంలో కోటి పారితోషికం అందుకున్న తొలి కథానాయికగా రికార్డులు బ్రేక్ చేసింది. అగ్ర నటిగా ఒక్కో సినిమాకి 40 కోట్ల పారితోషికం అందుకుంటూ సంచలనంగా మారింది. పీసీ గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అందుకే తాను ఎంత డిమాండ్ చేస్తే అంతా ఇస్తున్నారు. అయితే తన మార్కెట్ ని గ్లోబల్ స్థాయికి విస్తరించడం ద్వారా మాత్రమే పీసీ ఈ స్థాయిని అందుకుందని విశ్లేషించాలి. భారతదేశం నుండి అత్యధిక పారితోషికం తీసుకునే నటిగా పీసీకి మాత్రమే అర్హత ఉంది.
గ్లోబల్ మార్కెట్లో హవా సాగిస్తున్న దేశీ గాళ్ ప్రియాంక చోప్రా ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 40 కోట్ల వరకు వసూలు చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో షో సిటాడెల్ కోసం 40 కోట్లు వసూలు చేసింది. ఫోర్బ్స్ ప్రకారం.. భారతదేశంలో ఒక్కో చిత్రానికి 14-20 కోట్ల మేర పారితోషికం అందుకుంటోంది. పీసీ కాకుండా ఇతర కథానాయికల్లో కంగనా రనౌత్, కత్రినా కైఫ్ ఒక్కో సినిమాకు 25 కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. కరీనా కపూర్, అనుష్క శర్మ, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి వారు రూ. 10-20 కోట్ల మధ్య వసూలు చేస్తారు. దీపికా పదుకొణె 20కోట్లు డిమాండ్ చేస్తోందని కథనాలొచ్చాయి. ఆ తర్వాత అలియా భట్ 12 కోట్లు అందుకుంటోందని ప్రచారం ఉంది.