కరేబియన్ ద్వీపంలో ప్రియాంక పోరాటం!
పీరియాడికల్ డ్రామా 'ది బ్లప్' లో అమ్మడు భాగమవుతున్నట్లు తెలుస్తోంది
హాలీవుడ్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య 'సీటాడెల్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సిరీస్ మాత్రం పీసికి కలిసిరాలేదు. సీటాడెల్ కోసం అమ్మడు ఎంతో శ్రమించింది గానీ...ఫలితం మాత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. అయినా సరే పీసీ జోరు ఏమాత్రం తగ్గలేదు. కొత్త చిత్రాలు అందుకో వడంలో ముందు వరుసలోనే కనిపిస్తోంది. తాజాగా రస్సో బ్రదర్స్ నిర్మిస్తోన్న చిత్రంలోనూ ఛాన్స్ అందుకుంది.
పీరియాడికల్ డ్రామా 'ది బ్లప్' లో అమ్మడు భాగమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రాంక్ ఇ ప్లవర్స్ దర్శక త్వంలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ లో 'అవతార్'..'గార్డియన్స ఆఫ్ ది గెలాక్సీ' ఫేం జోయా సల్డానా స్థానంలో ప్రియాంక చోప్రాని ఎంపిక చేయడం విశేషం. చాలా మంది ఇంగ్లీష్ భామల పేర్లను పరిశీలించి నప్పటికీ..కొంత మందిపై టెస్ట్ షూట్ కూడా నిర్వహించినప్పటికీ ఆ పాత్రకి పీసీ అయితేనే న్యాయం చేస్తుందని మేకర్స్ ఆమెని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
1800 లో కరేబియన్ ద్వీపంలో జీవించే ఒక మహిళ తన కుటుంబాన్ని ..గ్రామాన్ని క్రూరమైన దాడుల నుంచి ఎలా కాపాడింది అనే అంశం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో తన గతం ఏంటి? ఆమె అంత మొరటుగా ఉండటానికి కారణం ఏంటి? వంటి అంశాలు సినిమాలో చర్చించబో తున్నారు. జూన్ లో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుళ్లనున్నారు. దీన్ని బట్టీ పీసీ చాలా పెద్ద సాహసోపే తమైన పాత్రలోనే నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంతవరకూ అమ్మడు ఇలాంటి సాహసాలు చేసింది లేదు. రొమాంటిక్ యాక్షన్ జానర్ చిత్రాల్లోనే నటిం చింది. కానీ ఇప్పుడు కరేబియన్ దీవుల్లో కృరమైన పాత్రల మధ్య తనని తాను ఎలా కాపాడుకుంది? అన్న ది హైలైట్ కాబోతుంది. ఈ సిరీస్ కి ఇండియాలో భారీ క్రేజ్ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.