సరిపోదా చారులత చాలా స్పెషల్...!

విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

Update: 2024-08-20 19:30 GMT

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందిన 'సరిపోదా శనివారం' ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన అంటే సుందరానికి సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేదు. ఆ సినిమాకి జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ ప్రేక్షకులు తమ కాంబో నుంచి ఎలాంటి సినిమాను ఆశిస్తున్నారో అలాంటి సినిమాను తీసుకు రాబోతున్నట్లు నాని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. విభిన్నమైన కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులతో పాటు అన్ని భాషల ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు పెరిగే విధంగా సినిమాకు సంబంధించిన విషయాలను రివీల్‌ చేస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా లో హీరోయిన్‌ ప్రియాంక అరుల్‌ మోహన్‌ పాత్ర గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ట్రైలర్‌ లో కానీ, అంతకు ముందు కానీ ప్రియాంక మోహన్‌ పోషించిన చారులత పాత్ర గురించి పెద్దగా రివీల్‌ చేయలేదు. కానిస్టేబుల్‌ చారులతగా ప్రియాంక మోహన్‌ కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. అయితే ఆమె పాత్ర చాలా స్పెషల్‌ గా ఉంటుంది అనే వార్తలు వస్తున్నాయి.

చారులత కానిస్టేబుల్‌ పాత్రే అయినా కూడా కథ లో అత్యంత కీలక మలుపు ఈమె పాత్ర వల్లే ఉంటుందట. అంతే కాకుండా సినిమా మొత్తం కూడా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. వివేక్ ఆత్రేయ సినిమాల్లో హీరోయిన్‌ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆ విషయం ఆయన గత చిత్రాలను చూస్తే అర్థం అవుతుంది. కనుక చారులత కూడా ఈ సినిమాలో చాలా స్పెషల్ గా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు కూడా ఈ విషయాన్ని ఇటీవల ఆఫ్‌ ది రికార్డ్‌ చెప్పుకొచ్చారు.

ఈ సినిమాలో నాని, ప్రియాంక అరుల్‌ మోహన్‌ పాత్రలతో పాటు ఎస్ జే సూర్య పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని సమాచారం అందుతోంది. తమిళంతో పాటు ఇతర భాషల్లో కూడా సరిపోదా శనివారం సినిమాను విడుదల చేయబోతున్నారు. తమిళంలో ఇప్పటికే ఎస్ జే సూర్య వల్ల మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. ఇక హిందీ మరియు ఇతర భాషల్లో విడుదల సమయం వరకు ప్రమోషన్‌ చేయడం ద్వారా క్రేజ్‌ పెంచాలని భావిస్తున్నారు. నాని గత చిత్రాలు కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో హిట్‌ అవ్వలేదు. కానీ ఈ సినిమా కచ్చితంగా బిగ్గెస్ట్‌ హిట్‌ గా నిలవడం ఖాయం అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News