తెలుగు పరిశ్రమకు వెట్రిమారన్.. కథే మమ్మల్ని నడిపించింది..!

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో విరాట్ ప్రగతి జంటగా ద్వారా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన సినిమా పెదకాపు.

Update: 2023-09-24 06:08 GMT

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో విరాట్ ప్రగతి జంటగా ద్వారా క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన సినిమా పెదకాపు. ఈ సినిమా మొదటి పార్ట్ ఈ నెల 29న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేశారు. శనివారం జరిగిన ఈ వేడుకలో నిర్మాత రవీందర్ రెడ్డి స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. నిర్మాత అంటే డబ్బులు పెట్టడం కానీ చేస్తున్న సినిమా మీద ఎంత అవగాహన ఉండాలనేది రవీందర్ రెడ్డి మాటలను బట్టి చూస్తే అర్ధమవుతుంది.

ఈవెంట్ లో ఎంతో ఉత్సాహంగా మాట్లాడారు రవీందర్ రెడ్డి. ఇది తన బ్యానర్ లో నాల్గవ సినిమా అని.. ముందు 3 సినిమాలు వేరు ఈ సినిమా జర్నీ వేరు. ఆ 3 సినిమాలతో చేయని జర్నీ ఈ సినిమాతో చేశానని అన్నారు. ఒక సినిమాకు కథ అనుకోవడం వేరు సినిమా తీయడం వేరు సినిమా అనుకున్నప్పటి నుంచి ప్రొడక్షన్ సైడ్ నుంచి అంతా బాగా కుదిరాయని అన్నారు. ఈ సినిమా మెయిన్ పిల్లర్స్ లో ఒకరు చోటా కె నాయుడు. ఆయన్ను చోటా అంటారు కానీ ఆయన వర్క్ చాలా పెద్దది. చోటా గారు ప్లే బోయ్ అనుకుంటారు కానీ ఆయనతో ట్రావెల్ అయ్యా రెస్పెక్ట్ పెరిగింది. సినిమాకు ఆయన ఇచ్చే రెస్పెక్ట్ వేరు. 42 ఏళ్లుగా ఇండస్ట్రీలో చాలా చేశారు. వర్క్ పట్ల ఆయన డెడికేషన్ వేరే లెవెల్ లో ఉంటుందని బయట కనిపించే చోటా కె నాయుడు వేరని అన్నారు.

ఇక ఈ సినిమాకు మరో మెయిన్ పిల్లర్ పీటర్ మాస్టర్. ఆయనకు సినిమా తప్ప మరో ఆలోచన ఉండదు. సినిమా కోసం అన్ని ఎమోషన్స్ చూపిస్తాడని అన్నారు. సినిమాకు మిక్కీ జే మేయర్ మంచి వర్క్ ఇచ్చారు. ఆర్.ఆర్ విషయంలో తనకు కొంత డౌట్ ఉండేది కానీ నా నమ్మకాన్ని నిలబెట్టారని అన్నారు రవీందర్ రెడ్డి.

సినిమా ట్రైలర్ కటింగ్ కి ఫుల్ స్క్రిప్ట్ అడిగాడు ట్రైలర్ భాస్కర్ అతను సినిమా చూశాక చెప్పిన మాట సెన్సార్ టీం లో ఒకరు చెప్పారు అది ఏంటి అన్నది సినిమా రిలీజ్ తర్వాత చెబుతా అన్నారు. ఇక కెప్టెన్ ఆఫ్ ది షిప్ శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడుతూ ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే.. ప్రపంచానికి ఎవరైనా ఒకసారి పరిచయం అవుతారు కానీ శ్రీకాంత్ రెండోసారి పరిచయం అవుతున్నారు. పెదకాపు రిలీజ్ తర్వాత తెలుగు పరిశ్రమకు వెట్రిమారన్ దొరికాడని అంటారని రవీందర్ రెడ్డి అన్నారు. శ్రీకాంత్ అడ్డాలకు ఎప్పుడు థ్యాంక్ ఫుల్ గా ఉంటానని అన్నారు.

సినిమాలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ జీవించేశారు. చాలా మందికి దెబ్బలు తగిలాయి. విరాట్ మొదటి రోజు నుంచే గాయాలపాలయ్యాడు. సినిమాకు అతను చాలా కష్టపడ్డాడని అన్నారు. కథను నమ్మాం కాబట్టి ఈ సినిమా చరణ్, ఎన్.టి.ఆర్ చేస్తే ఎలా ఉంటుందో అలానే చేద్దామని ఎక్కడ రాజీ పడలేదని అన్నారు రవీందర్ రెడ్డి. ఇలాంటి కథలో ఎవరో ఒకరు చేయాలంటే కుదరదు కథే హీరోని ఎంచుకుంటుందని అన్నారు.

ఒక మనిషి.. ఒక కుటుంబం.. ఒక సమూహం.. ఒక ప్రాంతం నా అనుకునే వారికి కాపుకాసే ప్రతి కాపుకి ఈ సినిమా అంకితమని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు నిర్మాత రవీందర్ రెడ్డి. సినిమా స్పీచ్ లలో నటులు, దర్శకులు ఎక్కువ మాట్లాడటం విని ఉంటాం కానీ తను తీసిన సినిమా గురించి ఒక నిర్మాత ఇంతగా మాట్లాడటం చాలా అరుదు. పెదకాపు నిర్మాత రవీందర్ రెడ్డి స్పీచ్ అందరినీ సర్ ప్రైజ్ చేసిందని చెప్పొచ్చు.

Tags:    

Similar News