స్టార్ హీరోకి నిర్మాతల మండలి చెక్.. షాక్‌లో ఫ్యాన్స్!
ఇటీవల చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే అడ్వాన్స్ పొందిన నిర్మాణ సంస్థ చిత్రాలలో పనిచేయకుండా కొత్త నిర్మాణ సంస్థలతో పని చేస్తున్నారు.
అడ్వాన్సులు తీసుకుని ఏళ్ల తరబడి నటించకుండా, నిర్మాతలకు సహకరించని స్టార్లపై తమిళ నిర్మాతల సంఘం కొరడా ఝలిపించింది. ఈ కొరడా దెబ్బ తిన్నవాళ్లలో స్టార్ హీరో ధనుష్ ప్రథముడు. చేతిలో పలు సినిమాలు ఉండి, పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్‌లు అందుకున్న ధనుష్ తో సినిమా చేసే ముందు నిర్మాతలు నేరుగా అసోసియేషన్‌తో సంప్రదింపులు జరపాలని కొత్త ఉత్తర్వులు జారీ చేయడం కలకలం రేపింది. ఇది ఆయన అభిమానులనే కాకుండా చాలా మందిని షాక్ కి గురి చేసింది.
చెన్నైలో ఇటీవల నిర్మాతల సంఘం, నటీనటుల సంఘం, డిస్ట్రిబ్యూటర్ల సంఘం ఏకతాటిపైకి వచ్చి సమావేశాలు నిర్వహించగా వీటిలో కీలక సమీక్షల అనంతరం కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి నిర్మాతల సంఘం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళ సినీ నిర్మాతలు, తమిళ చిత్ర నిర్మాతల సంఘం కార్యవర్గ నిర్వాహకులు, తమిళనాడు థియేటర్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్‌లు, తమిళనాడు థియేటర్ మల్టీప్లెక్స్ ఓనర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్‌లు, తమిళనాడు ఫిల్మ్స్ కరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్‌ల నేతృత్వంలో చెన్నైలో సంయుక్త సమావేశం జరిగింది. సమావేశంలో ఈ క్రింది తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఇటీవల చాలా మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఇప్పటికే అడ్వాన్స్ పొందిన నిర్మాణ సంస్థ చిత్రాలలో పనిచేయకుండా కొత్త నిర్మాణ సంస్థలతో పని చేస్తున్నారు. దీంతో అడ్వాన్స్ చెల్లించిన నిర్మాతలు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అందుకోసం నిర్మాత నుంచి అడ్వాన్స్ తీసుకున్న నటుడు, నటి, సాంకేతిక నిపుణులు ఎవరైనా సినిమాను పూర్తి చేసి తదుపరి చిత్రాలు చేయాల్సి ఉంటుందని ఈ సమావేశంలో నిర్ణయించారు.
ముఖ్యంగా చేతిలో చాలా సినిమాలు ఉండి, పలువురు నిర్మాతల నుంచి అడ్వాన్స్‌లు తీసుకున్న నటుడు ధనుష్.. తనతో సినిమాలు చేసే ముందు నిర్మాతలు, నిర్మాతల సంఘంతో సంప్రదింపులు జరపాలని కొత్తగా ఆర్డర్ ఇవ్వడంతో అతడి అభిమానులు షాక్ కి గురయ్యారు. ధనుష్ `రాయన్` సినిమాలో నటించకుండా.. విడుదలకు ముందు పలు చిత్రాలకు నిర్మాతల నుంచి అడ్వాన్స్ లు తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో నిర్మాతల సంఘం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఆయన అభిమానులనే కాకుండా చాలా మందిని షాక్ కి గురి చేసింది.