బిగ్ బాస్ 8 : నిఖిల్ పృధ్వి ఇది కదా అసలు ఆటంటే..?
దానిలో భాగంగా బస్తాలు వస్తుంటే వాటిని తమకు ఇచ్చిన చక్రాల బండి మీద పెట్టాల్సి ఉంటుంది.
బిగ్ బాస్ సీజన్ 8 లో ప్రస్తుతం బీబీ రాజ్యం టాస్క్ జరుగుతుంది. రాయల్ క్లాన్, ఓజీ క్లాన్ మధ్య జరుగుతున్న ఈ టాస్క్ లో భాగంగా బీబీ రాజ్యం లో హాస్పిటల్, వ్యవసాయానికి సంబంధించిన టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దానిలో భాగంగా బస్తాలు వస్తుంటే వాటిని తమకు ఇచ్చిన చక్రాల బండి మీద పెట్టాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో నిఖిల్, పృధ్వి ఓజీ క్లాన్ నుంచి పోటీలో పాల్గొనగా రాయల్ క్లాన్ నుంచి గౌతం, మెహబూబ్ మొదటి నాలుగు రౌండ్లు ఆ తర్వాత నాలుగు రౌండ్లు రాయల్ క్లాన్ నుంచి గౌతం, మెహబూబ్ కి బదులుగా అవినాష్, తేజ వచ్చారు.
ఐతే ఎనిమిది రౌండ్లలో ఒక బ్యాగ్ మాత్రం ఇచ్చిన టైం లో చక్రాల బండి మీద పెట్టలేకపోయారు కానీ మిగతా ఏడు బ్యాగ్ లు ఓజీ క్లాన్ వారే వేశారు. సో ఈ టాస్క్ లో ఓజీ క్లాన్ విజేతగా నిలిచింది. ఐతే ఈ టాస్క్ గెలిచిన సందర్భంగా ఓజీ క్లాన్ నుంచి పృధ్విని మెగా చీఫ్ కంటెండర్ గా ఎంపిక చేశారు ఓజీ క్లాన్. మరోపక్క గౌతం ని మెగా చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పుకున్నాడు.
ఇక నెక్స్ట్ రౌండ్ లో వైరస్, ఇంకా డిఫెన్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆ టాస్క్ లో కూడా ఓజీ క్లాన్ నుంచి వచ్చిన నిఖిల్, నబీల్ లు గెలిచారు. సో ఈసారి కూడా ఓజీ క్లాన్ నుంచి నిఖిల్ మెగా చీఫ్ కంటెండర్ గా ఎంపిక చేయగా రాయల్ క్లాన్ నుంచి గంగవ్వని చీఫ్ కంటెండర్ రేసు నుంచి తప్పించారు. ఐతే బీబీ రాజ్యం టాస్క్ లో ఓజీ క్లాన్ మెంబర్స్ చాలా కసిగా ఆడుతున్నారు.
అంతేకాదు రెండు వరుస రౌండ్లు గెలిచిన ఓజీ క్లాన్ మెంబర్స్ ఈ సీజన్ మనదే అవ్వాలని.. మన ఆరుగురిలో ఒకరిదే టైటిల్ అవ్వాలని అన్నాడు. ఇక నేడు టాస్క్ తో కొత్త మెగా చీఫ్ ఎవరన్నది తెలుస్తుంది. ఈ టాస్క్ లతో నిఖిల్, పృధ్విల సత్తా ఏంటన్నది మరోసారి ప్రూవ్ అయ్యింది. నిఖిల్ ఆట ఆడితే ఎలా ఉంటుందో చూపించాడు. ప్రస్తుతానికి టైటిల్ రేసులో ఉన్న ఒకరిద్దరిలో నిఖిల్ ఒకడు కాగా నిన్న పర్ఫార్మెన్స్ తో అతను ఆడియన్స్ మనసులు గెలిచాడు.