25 కోట్లకు 245 కోట్లు మళ్ళీ ఇప్పుడు సీక్వెల్

ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ దాడుల చేసింది.

Update: 2024-08-01 04:00 GMT

హిందీలో కొంతమంది దర్శకులు రియలిస్టిక్ సంఘటనలని స్ఫూర్తిగా తీసుకొని మూవీస్ చేస్తూ ఉంటారు. ఇలాంటి చిత్రాలకి మంచి ఆదరణ కూడా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా దేశభక్తి ఎలిమెంట్స్ తో చేసే కథలు చాలా వరకు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ స్ఫూర్తితోనే ఉంటాయి. 2019లో విక్కీ కౌశల్ హీరోగా యూరి అనే మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి చేసిన సర్జికల్ దాడుల చేసింది. ఆ దాడుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఉంటుంది.

రియల్ లైఫ్ లో ఈ సర్జికల్ దాడులలో పాల్గొన్న ఆర్మీ సోల్జర్స్ అనుభవాలని తీసుకొని, కొన్ని ఫిక్షనల్ అంశాలు జోడించి యూరి మూవీని 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని వరల్డ్ వైడ్ గా 245 కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇండియన్ ఆర్మీ చేసే సర్జికల్ దాడుల్ని చూడలేకపోయిన.. వారు ఎలాంటి సాహసాలు చేసి ఉంటారనేది ఈ సినిమాలో చూసి ఆశ్వాదించారు. సినిమాలో ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా స్ట్రాంగ్ గా ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యాయి.

ఈ కారణంగానే యూరి మూవీకి అద్భుతమైన ఆదరణ లభించింది. ఈ సినిమా హైయెస్ట్ ప్రాఫిట్ అందుకున్న బాలీవుడ్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. విక్కీ కౌశల్ ని కూడా యూరి మూవీ స్టార్ హీరోని చేసింది. యూరి సినిమా టైటిల్ ని కూడా సర్జికల్ దాడులు జరిగిన ప్రాంతం పేరు మీదనే ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని అనుకుంటున్నారంట.

ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ప్రకటన రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి యూరిలో ఇండియన్ ఆర్మీ సర్జికల్ స్ట్రైక్ చేయడానికి కారణం పుల్వామా దాడి. పాకిస్థాన్ టెర్రరిస్ట్ లు ఇండియన్ ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఆత్మాహుతి బాంబ్ ఎటాక్ చేశారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు చనిపోయారు.

ఈ పుల్వామా ఘటన దేశ వ్యాప్తంగా ప్రజలని కదిలించింది. ఈ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించింది. ఈ పుల్వామా ఉగ్రదాడుల నేపథ్యంలోనే కథని చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి ఎలాంటి టైటిల్ పెడతారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News