పూరి సిక్స్త్ సెన్స్ గురించి ఇలా!
తాజాగా `బాడీ విస్పర్` గురించి తన ఛానల్ వేదికగా కొన్ని విషయాలు పంచు కున్నారు.
డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పూరి మ్యూజింగ్స్ పేరుతో యూట్యూబ్ లో స్పెషల్ విడియోలు రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాను ఎంపిక చేసుకున్న అంశంపై తనదైన శైలిలో విశ్లేషించడం పూరి ప్రత్యేకత. ఇప్పటికే ఎన్నో అంశాలపై పాడ్ కాస్ట్ నిర్వహించారు. తాజాగా `బాడీ విస్పర్` గురించి తన ఛానల్ వేదికగా కొన్ని విషయాలు పంచు కున్నారు. అవేంటో ఆయన మాటల్లోనే..` మనందరి శరీరాల్లో అంతర్లీనంగా అలారమ్ సిస్టమ్ ఉంది.
దాన్నే అంతర్ దృష్టి లేదా సిక్త్స్ సెన్స్ అంటాం. ఏదైనా జరగబోయే ముందు బాడీ మనకి వార్నింగ్ ఇస్తుంది. చాలా సార్లు తప్పు జరిగాక మన అంతర్ దృష్టి చెప్పిందే కరెక్ట్ అని ఫీలవుతాం. ఏదైనా ప్రమాదం జరిగే ముందు పొట్ట టైట్ అవుతుంది. దీన్నే గట్ ఫీలింగ్ అంటాం.సెకెండ్ బ్రెయిన్ అని దానికి మరో పేరు. గట్ ఫీలింగ్ కు- మన భావోద్వే గాలకు లింక్ ఉంటుంది. ఏదైనా డేంజర్ అని తెలిసినప్పుడు హార్ట్ రేట్ పెరుగుతుంది. చెమట పడుతుంది. వణికిపోతుంటాం.
మన మైండ్ మనకు వార్నింగ్ ఇస్తూనే ఉంటుంది. కానీ మనం పట్టించుకోం. ఇది తప్పు చేయోద్దు అని మొదడు చెబుతున్నా? ఏం కాదు అనుకుని చేసేస్తాం. మన బాడీ విస్పర్ ని కచ్చితంగా వినాలి. ఎప్పుడైనా మనం పెద్దగా పరిచయం లేని వారిని, అపరిచితులను మీట్ అవ్వాల్సి వస్తుంది. వారు ఎక్కడికైనా రమ్మంటే వెళ్లొచ్చు. ఒకవేళ మీరు అక్కడ ఇబ్బందిగా ఫీలైతే ఒక్క క్షణం ఉండొద్దు. జీవితంలో ఓ లక్ష్యం పెట్టుకుని దాని కోసం కష్టపడే వారికి అంతర్ దృష్టి ఎక్కువగా పనిచేస్తుందని విన్నా.
ఇది నాలుగు రకాలు 1 ఐసీ, 2 ఐనో, 3. ఐఫీల్, 4 ఐహియర్. మీరు మీ అంతర్ దృష్టిని నమ్మితే ఇంకా మంచి నిర్ణయాలు తీసుకోగలరు. ఆహారం ఎలా ఉంది? తినొచ్చా? అన్న విషయాలను చెప్పేదదే. అడవుల్లో లభించే ఎన్నో ఆకులు మేలు చేస్తాయని అంతర్ దృష్టి వల్లే మనకు తెలుస్తుంది. జంతువులకు ఆయుర్వేదం తెలియదు. వాటికి నచ్చినవి తింటాయి. మనం ఎవరినైనా కలిసినప్పుడు అతడు పాజిటివ్ గా ఉన్నాడా? నెగిటివ్ గా ఉన్నాడా? అన్నది వెంటనే తెలిసిపోతుంది.
ఈ స్నేహం ఇక్కడితే ఆపేయ్ అని సిక్స్త్ సెన్స్ చెబుతూనే ఉంటుంది గానీ మనం వినిపించుకోం. మీరు ఇకపై ఏదైనా ఒప్పందానికి సంతకం చేయబోయే ముందు మీ అంతర్ దృష్టిని ఒక్కసారి అడగండి. మీరు ప్రశాంతంగా ఉంటేనే అది పని చేస్తుంది. మీ గట్ ఫీలింగ్ కరెక్ట్ గా లేకపోయినా? మీరు ఇబ్బందిగా ఫీలైనా? బాడీ ఏదో చెప్పేం దుకు ప్రయత్నిస్తుందని అర్దం చేసుకుండి. ధ్యానం చేయడం, డ్రాయింగ్ వేయడం తో అంతర్ దృష్టి పెరుగు తుంది. గుర్తు పెట్టుకోండి. మీ అంతర్ దృష్టి మీకు బెస్ట్ గైడ్` అని అన్నారు.