పుష్ప సీక్వెల్.. బిగ్గెస్ట్ బ్రాండ్స్ తో..
తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఏ సినిమాకు అయినా పలు సంస్థలు కొలబరేట్ చేస్తాయి.
పుష్ప-2.. కేవలం తెలుగు ఆడియన్సే కాకుండా పాన్ ఇండియా సినీ ప్రియులు అంతా వేయికళ్లతో ఎదురు చూస్తున్న సినిమా అది. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఆ మూవీపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. తొలి భాగం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అంతా సీక్వెల్ పై భారీ హోప్స్ పెట్టుకున్నారు. కచ్చితంగా బాక్సాఫీస్ ను మూవీ షేక్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
డిసెంబర్ లో రిలీజ్ కానున్న పుష్ప-2 నుంచి ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ వేరే లెవెల్ రెస్పాన్స్ అందుకుంది. అందరినీ ఓ రేంజ్ లో మెప్పించింది. సినిమాపై హోప్స్ పెంచింది. త్వరలోనే మేకర్స్.. స్పెషల్ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. పాన్ ఇండియా లెవెల్ లో ఈవెంట్స్ ను నిర్వహించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో సినిమా కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు.
అయితే రిలీజ్ కు ముందే పుష్ప-2 ఎన్నో రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో అరుదైన ఘనత సాధించింది. ఏ సినిమాకు అయినా పలు సంస్థలు కొలబరేట్ చేస్తాయి. కానీ పుష్ప సీక్వెల్ కు ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రీతిలో అనేక ప్రముఖ వ్యాపార సంస్థలు సహకారం అందిస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా కొలబరేట్ చేస్తున్నాయి. ఈ మేరకు మేకర్స్.. బిగ్గెస్ట్ కొలబరేటింగ్ మూవీ అంటూ పోస్ట్ చేశారు.
మేకర్స్ క్రేజీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. పుష్ప గాడి రేంజ్ మామూలుగా లేదని అంటున్నారు. పుష్ప మ్యానియా అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు. పుష్పను కొలబరేట్ చేస్తున్న బ్రాండ్స్ పేర్లను చూసి షాక్ అవుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి సినిమాకు కొలబరేటింగ్ కామనే అయినా.. పుష్పకు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి క్లియర్ గా ప్రూవ్ అయిందని కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే. ఫస్ట్ పార్ట్ లో ఎర్రచందనం సిండికేట్ కు నాయకుడిగా ఎదిగిన పుష్ప రాజ్.. ఆ సామ్రాజ్యాన్ని ఎలా పాలించారు? అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? తదితర విషయాలను పుష్ప సీక్వెల్ లో మేకర్స్ చూపించనున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్న ఆ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.