పార్టీ ఉంది పుష్ప..!
ఈ సినిమా ఇంతపెద్ద స్కేల్ లో.. ఇలా తీయడానికి అన్ని విధాలుగా సహకరించిన మైత్రి మూవీ మేకర్స్. ఇలా అందరు పుష్ప 2 ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 సాధించిన విజయం గురించి చేస్తున్న కలెక్షన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా ఈ రేంజ్ బజ్ క్రియేట్ చేస్తుందని ముందే గెస్ చేశారు కాబట్టే రిలీజ్ ముందు నేషనల్ లెవెల్ లో ఆ రేంజ్ ప్రమోషన్స్ నిర్వహించారు మేకర్స్. వారి ప్లాన్ కు తగినట్టుగానే సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. పుష్ప 2 రియల్ పాన్ ఇండియా హిట్ గా నిలుస్తూ రోజు రోజుకి భారీ కలెక్షన్ కౌంట్ తో సర్ ప్రైజ్ చేస్తుంది. ఈ ఆనందంలో పుష్ప 2 కి సంబందించిన దర్శక నిర్మాతలు, హీరో అల్లు అర్జున్, సినిమాటోగ్రాఫర్ కుబా, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్, హీరోయిన్ శ్రీలీలతో, లిరిసిస్ట్ చంద్రబోస్ లతో స్పెషల్ ప్రైవేట్ పార్టీ చేసుకున్నట్టు తెలుస్తుంది.
సినిమాలో ప్రతి ఒక్కరు తమ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు. పుష్ప 2 ఈ సక్సెస్ కు ఎవరి సెగ్మెంట్స్ లో వారు ది బెస్ట్ ఇచ్చారు. తెర మీద పుష్ప రాజ్ పూనకాలకు తగినట్టుగా దేవి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. సుకుమార్ టేకింగ్ కు కూబా సినిమాటోగ్రఫీ మ్యాజిక్ చేసింది. ఇక కిసిక్ సాంగ్ తో శ్రీలీల థియేటర్ అంతా దద్దరిల్లిపోయేలా చేసింది. పుష్ప 1 లో నాతోటి పోటీ పడే ఇంకోడు ఉన్నాడు అంటే అది కూడా నేనే అంటూ లిరిసిస్ట్ చంద్రబోస్ రాసినట్టుగా పుష్ప 1 రికార్డులే కాదు పుష్ప 2 డే 1 ఆల్ టైం రికార్డులను అల్లు అర్జున్ కొల్లగొడుతున్నాడు. అలాంటి లిరిక్స్ ఇచ్చిన చంద్రబోస్, ఇక ఈ సినిమా రూపొందడానికి కర్త కర్మ క్రియ అన్నీ తానై నడిపించిన సుకుమార్.. ఈ సినిమా ఇంతపెద్ద స్కేల్ లో.. ఇలా తీయడానికి అన్ని విధాలుగా సహకరించిన మైత్రి మూవీ మేకర్స్. ఇలా అందరు పుష్ప 2 ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు.
దీనికి సంబంధించిన ఒక పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమా తెర మీద అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్, రష్మిక, శ్రీలీల గ్లామర్ కనిపిస్తున్నాయి. ఈ రేంజ్ అవుట్ పుట్ కోసం ఎంతో శ్రమించిన కెమెరా మెన్ కూబా, అద్భుతమైన లిరిక్స్ ఇచ్చి సినిమాను ఈ రేంజ్ లో ఆడియన్స్ కు ఎక్కేలా చేసిన లిరిసిస్ట్ చంద్రబోస్ కూడా ఈ స్పెషల్ పార్టీలో భాగం అయ్యారు. వీరితో పాటు సుకుమార్ భార్య తబిత సుకుమార్ కూడా ఈ పార్టీలో ఉన్నారు.
పుష్ప 2 ప్రైవేట్ పార్టీలో దేవి శ్రీ ప్రసాద్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాడు. పుష్ప 2 తమిళ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతలపై దేవి అసంతృప్తి మాటలు తెలిసిందే. ఐతే ఆ కామెంట్స్ వారి మధ్య గ్యాప్ పెంచుతుందని అనుకున్నారు. కానీ ఈ పార్టీతో వాటికి చెక్ పెట్టినట్టే లెక్క.
లెక్కల మాస్టర్ సుకుమార్ ఒక సినిమాను పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో తీస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో పర్ఫెక్ట్ గా చెప్పేలా పుష్ప 2 సినిమా ఫలితం.. అంది దక్కించుకుంటున్న కలెక్షన్స్ చూసి చెప్పొచ్చు. పుష్ప 2 ప్రైవేట్ పార్టీలో అందరి ముఖాలు సూపర్ హిట్ కొట్టామన్న గర్వంతో పాటు సంతోషంగా వెలిగిపోతున్నాయి.