పుష్ప రాజ్ 3D వెర్షన్ రెడీ!

ఇక ఈ 3D వెర్షన్ కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2024-12-15 07:40 GMT

‘పుష్ప 2’ మూవీ వరల్డ్ వైడ్ గా అదిరిపోయే కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన అన్ని చోట్ల మూవీకి అద్భుతమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల వసూళ్లని క్రాస్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో ఈ మూవీ 500 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. శనివారం ఈ సినిమాకి హిందీ భాషలో 46.50 కోట్లు కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

 

ఆదివారం కూడా ఈ సినిమా హిందీలో 50 కోట్ల కలెక్షన్స్ మార్క్ దాటుతుందని అనుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా ‘పుష్ప 2’ సినిమాకి రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. టికెట్ రేట్లు తగ్గడంతో ప్రేక్షకులు మరల థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఏ స్థాయిలో వసూళ్లని అందుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా సినిమాలో గంగమ్మ జాతర, క్లైమాక్స్ లో యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారు.

అందుకే రిపీటెడ్ గా ఈ సినిమాని చూసేందుకు థియేటర్ కి వెళ్తన్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ‘పుష్ప 2’ 3D వెర్షన్ ని మేకర్స్ అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. పోస్టర్ రిలీజ్ చేసి ఈ 3D వెర్షన్ ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చినట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో సెలక్టడ్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో మాత్రమే ఈ 3D వెర్షన్ రిలీజ్ అవుతుందని తెలిపారు. దానికి సంబంధించి టికెట్ బుకింగ్ పోర్టల్ ని షేర్ చేశారు.

3D వెర్షన్ పనుల కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నారు. అందుకే ఇంత ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ 3D వెర్షన్ కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఆదరణ పెరిగితే ఇతర నగరాలలో కూడా మల్టీప్లెక్స్ లలో దీనిని రిలీజ్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాకి లాంగ్ రన్ లో 1500 కోట్ల వరకు కలెక్షన్స్ వస్తాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి.

అల్లు అర్జున్ మార్కెట్ కూడా ఈ చిత్రంతో అమాంతం పెరిగిపోయింది. నెక్స్ట్ అతని నుంచి రాబోయే సినిమాలు అన్ని కూడా ‘పుష్ప 2’ ని మించి వసూళ్లు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఇక ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో అత్యధిక మార్కెట్ కలిగిన స్టార్ గా బన్నీ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. మరి అతని భవిష్యత్తు సినిమాలు ఇంకా ఎంతగా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయో చూడాలి.

Tags:    

Similar News