పుష్ప 1 రీకాప్.. సుకుమార్ ప్లాన్ ఏంటో..?
అయితే బాహుబలి 2 రిలీజ్ టైం లో థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి బాహుబలి 1 రీకాప్ చేస్తూ ఒక ప్రాణం సాంగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి
అసలు ఒక కథను రెండు భాగాలుగా ఒక సినిమాలు రెండు పార్టులుగా చెప్పొచ్చు అనే ఆలోచనే చాలా కొత్తది. తెలుగులో అలాంటి సాహసం చేశాడు రాజమౌళి. బాహుబలి సినిమాతో రాజమౌళి ఈ కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టాడు. బాహుబలి 1 ది బిగినింగ్.. బాహుబలి 2 కన్ క్లూజన్ అంటూ రెండు భాగలుగా సినిమా వచ్చింది. బాహుబలి 1 కి పార్ట్ 2కి కాస్త టైం తీసుకున్నాడు. అయితే బాహుబలి 2 రిలీజ్ టైం లో థియేటర్ కి వచ్చిన ఆడియన్స్ కి బాహుబలి 1 రీకాప్ చేస్తూ ఒక ప్రాణం సాంగ్ ప్లాన్ చేశాడు రాజమౌళి. బాహుబలి 1 సినిమా మొత్తం ఒక ప్రాణం సాంగ్ తో చెప్పేశాడు.
బాహుబలి 1 మొత్తం ఒక పాటలో చెప్పాలని రాజమౌళి ఆలోచనకు కీరవాణి మ్యూజిక్ తోడై ఆ సాంగ్ ఆ సినిమా లీడ్ అదిరిపోయాయి. ఇక ఇదే దారిలో రెండు భాగాలుగా వచ్చిన మరో సినిమా కె.జి.ఎఫ్ 2 లో కూడా కె.జి.ఎఫ్ 1 కి సంబందించిన రీకాప్ కట్ షాట్స్ లో మొదటి రెండు నిమిషాల్లో కథ చెప్పేశాడు. మొదటి పార్ట్ చూడకుండా రెండో భాగం చూసే ఛాన్స్ లేదు కానీ ఒకవేళ ఎవరైనా అలా చూసినా మొదటి పార్ట్ గురించి అలా టచ్ చేస్తూ వచ్చారు రాజమౌళి, ప్రశాంత్ నీల్.
అయితే ఇప్పుడు సుకుమార్ వంతు వచ్చింది. పుష్ప 2 రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. పుష్ప 2 లో పార్ట్ 1 కి సంబంధించిన రీకాప్ ఎలా ఉంటుంది.. పుష్ప 1 ది రైజ్ ని పుష్ప 2 లో సుకుమార్ ఎలా చూపిస్తాడని ఆడియన్స్ లో ఎగ్జైట్మెంట్ మొదలైంది. పుష్ప 1 ది రైజ్ లో హై మూమెంట్స్ చాలానే ఉన్నాయి. అవే ఆడియన్స్ ని పుష్ప రాజ్ పాత్రని వారిలో ఎక్కించుకునేలా చేశాయి. మరి పుష్ప 2 లో పుష్ప 1 రీకాప్ ని కూడా అదే హై మూమెంట్స్ తో ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.
బాహుబలి లా పాటగానా.. లేదా KGF తరహాలో రీకాప్ కట్ షాట్స్ లోనా ఏదైనా సరే పుష్ప 1 రీకాప్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్. పుష్ప 1 చూడకుండా డైరెక్ట్ గా పుష్ప 2 చూసే వాళ్లు కూడా మళ్లీ వెళ్లి పుష్ప 1 చూసేలా ఈ రీకాప్ ఉంటుందని అంటున్నారు. సుకుమార్ ప్లానింగ్ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. మొత్తానికి సుకుమార్ పుష్ప 2 లో మరోసారి పుష్ప 1 ని చూపించి సినిమా రేంజ్ మరింత పెంచాలని ఫిక్స్ అయ్యాడు.