పుష్ప 2 బిజిఎం.. ఈ ట్విస్ట్ ఏంటో..?

ఐతే పుష్ప 2 కి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు సామ్ సిఎస్ అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టైటిల్ క్రెడిట్స్ దక్కించుకున్నాడు.

Update: 2024-12-05 16:07 GMT

పుష్ప 2 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ కాకుండా మరో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ పని చేశారన్న టాక్ ఉంది. థమన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. పూర్తి బిజిఎం ఇవ్వాల్సి ఉన్నా 15 రోజుల్లో వర్క్ పూర్తి చేయడం కష్టమని ఒక ఎపిసోడ్ కి ఇచ్చానని థమన్ అన్నాడు. ఐతే అది కూడా దేవి శ్రీ ప్రసాద్ కి నచ్చలేదు. అందుకే ఆయన చెన్నై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాతల మీద తన అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఐతే పుష్ప 2 కి దేవి శ్రీ ప్రసాద్ తో పాటు సామ్ సిఎస్ అడిషనల్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టైటిల్ క్రెడిట్స్ దక్కించుకున్నాడు.

ఐతే పుష్ప2 బిజిఎం విషయంలో కొన్నాళ్లుగా జరుగుతున్న చర్చ తెలిసిందే. ఐతే ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో సామ్ సిఎస్ పుష్ప 2 కి మాక్సిమం బిజిఎం తానే ఇచ్చానని అన్నాడు. సినిమా మొత్తంలో 90 శాతం వర్క్ తనదే అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. ఐతే దేవి శ్రీ ప్రసాదే మొత్తం బిజిఎం ఇచ్చి జస్ట్ ఏదో కొంతవరకు అడిషన బిజిఎం కోసం సాం సిఎస్ ని వాడుకున్నట్టు టైటిల్స్ లో వేశారు. మరి వీటిలో ఏది నిజం అన్నది తెలియదు కానీ పుష్ప 2 కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది.

ముఖ్యంగా జాతర ఎపిసోడ్, ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో బిజిఎం గూస్ బంప్స్ ఇచ్చింది. మాస్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేలా బిజిఎం ఉంది. స్వతహాగా తన సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చే దేవి పుష్ప 2 విషయంలో కాస్త హడావిడి అయ్యింది. అయినా కూడా ఎవరెవరిదో బిజిఎం వాడాలని అనుకున్నా ఫైనల్ గా దేవి ఇచ్చిన మ్యూజిక్ నే వాడినట్టు తెలుస్తుంది.

అంతేకాదు థమన్ స్వయంగా ఒక ఎపిసోడ్ కి బిజిఎం ఇచ్చానని చెప్పగా అసలు థమన్ పేరు టైటిల్స్ లో వేయలేదు. సో థమన్ ఇచ్చిన కంపోజింగ్ యూజ్ చేయలేదని చెప్పొచ్చు. పుష్ప 2 బిజిఎం ఎవరిచ్చారన్నది కాదు సినిమాకు ఎంత హెల్ప్ అయ్యింది అన్నది ఇంపార్టెంట్. సినిమా మాత్రం అల్లు ఫ్యాన్స్ కి మాత్రమే కాదు మాస్ ఆడియన్స్ అందరికీ ఫుల్ మీల్స్ అందించింది. పుష్ప 2 చివర్లో కాస్త తొందర పడినా ఫైనల్ అవుట్ పుట్ మాత్రం అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా చేశాడు సుకుమార్.

Tags:    

Similar News