పుష్ప 2… తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ హిట్ గా నిలవాలంటే?

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మూవీ కలెక్షన్స్ 200 కోట్ల షేర్ కి దగ్గరగా ఉన్నాయి. ప్రస్తుతం డీసెంట్ వసూళ్లతో థియేటర్స్ లో కొనసాగుతోంది.

Update: 2024-12-19 11:01 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ సెకండ్ వీక్ లో కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ చిత్రం 1400+ కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 1500 కోట్ల వరకు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే హిందీలో ఈ సినిమా ఇప్పటికే 600+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. హిందీలో అత్యధిక వసూళ్లు అందుకున్న చిత్రంగా ఉన్న ‘స్త్రీ 2’ కలెక్షన్స్ ని ‘పుష్ప 2’ బీట్ చేసిందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ మూవీ కలెక్షన్స్ 200 కోట్ల షేర్ కి దగ్గరగా ఉన్నాయి. ప్రస్తుతం డీసెంట్ వసూళ్లతో థియేటర్స్ లో కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాలలో ‘పుష్ప 2’ పైన 215 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది. మూవీ క్లీన్ హిట్ గా నిలవాలంటే మాత్రం ఈ కలెక్షన్స్ ని క్రాస్ చేయాల్సిందే. నెక్స్ట్ వీకెండ్ రాబోతోంది. దాంతో పాటుగా క్రిస్మస్ హాలిడేస్ కూడా కలిసి వస్తున్నాయి.

మూడో వారంలో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ అందుకుంటే లాంగ్ రన్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని క్రాస్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. క్రిస్మస్ ఫెస్టివల్ కానుకగా ‘పుష్ప 2’కి పోటీ ఇచ్చే రేంజ్ లో అయితే సినిమాలు ఏవీ రావడం లేదు. హిందీలో వరుణ్ ధావన్ ‘బేబీ జాన్’ రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ కొంత వరకు కలెక్షన్ తగ్గొచ్చు. అయితే తెలుగులో అల్లరి నరేష్ ‘బచ్చలమల్లి’, ప్రియదర్శి ‘సారంగపాణి జాతకం’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

అలాగే ఉపేంద్ర డబ్బింగ్ మూవీ ‘UI’, విజయ్ సేతుపతి ‘విడుదల 2’ సినిమాలు వస్తున్నాయి. వీటితో పాటు ‘పుష్ప 2’ మూవీ కూడా క్రిస్మస్ కలెక్షన్స్ ని షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ మూవీ ఇప్పటి వరకు 197.54 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. హిట్ కేటగిరీలోకి వెళ్ళడానికి ఇంకా 17.50 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంటుంది. ఇది ఎంత వరకు వసూళ్లు చేయగలుగుతుందనేది వేచి చూడాలి.

నైజాం - 90.36Cr

సీడెడ్ - 29.62Cr

ఉత్తరాంధ్ర - 22.34Cr

తూర్పు గోదావరి - 12.01Cr

పశ్చిమ గోదావరి - 9.32Cr

గుంటూరు - 14.60Cr

కృష్ణా - 12.02Cr

నెల్లూరు - 7.27Cr

ఏపీ- టీజీ టోటల్ - 197.54Cr (294.40Cr)***

Tags:    

Similar News