పుష్ప 2 బాస్ డైలాగ్ మార్చేశారు..!

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజైంది. నిన్న రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వేయగా నేడు ఉదయం నుంచి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజైంది

Update: 2024-12-05 11:03 GMT

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 రిలీజైంది. నిన్న రాత్రి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ వేయగా నేడు ఉదయం నుంచి వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజైంది. ఐతే ఈ సినిమా అలా ప్రీమియర్ షోలు పడ్డాయో లేదో అందులో సీన్స్, డైలాగ్స్ ఇలా అన్నిటి గురించి ప్రత్యేక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఎవర్రా బాస్ అంటూ చెప్పే ఒక డైలాగ్ మీద ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. పుష్ప రాజ్ ఎర్రచందనం డీల్ కోసం ఒక పెద్ద మనిషి దగ్గరకు వెళ్తాడు. అతనితో మాట్లాడే టైం లో పుష్ప రాజ్ బాస్ డైలాగ్ కొడతాడు.

అసలు సినిమాలో డైలాగ్ ఏంటంటే ఎవడ్రా బాస్.. ఎవడికి రా బాస్.. మామూలుగా చూస్తే నీకు బాస్ కనిపిస్తాడు. ఇలా తన కిందకు చూస్తేనే నీ బాస్ లకి బాస్ అనేస్తాడు.. నేనే రా నీ బాస్ అని చెబుతాడు. కానీ ఈ డైలాగ్ ని సోషల్ మీడియాలో వేరేలా చెబుతున్నారు. ఆ డైలాగ్ ని మార్చి ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్, ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి నేనే రా బాస్ అని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

సినిమాలో అసలు డైలాగ్ అది కాకపోయినా మెగా వర్సెస్ అల్లు ఫైట్ ని మరింత పెంచేందుకు డైలాగ్ ని మార్చి ఇలా ట్విట్టర్ లో పెడుతున్నారు. సినిమా చూడని మెగా ఫ్యాన్స్ ఆ డైలాగ్ నిజమేనేమో అనుకుని అల్లు ఫ్యాన్స్ మీద సోషల్ మీడియాలో ఎటాక్ చేస్తున్నారు. పుష్ప రాజ్ క్యారెక్టర్ పరంగానే అతనికి ఎవరు బాస్ లేరు అన్నట్టుగానే ఆ డైలాగ్ ఉంది. అంతేకాదు బాస్ కొడుకు, తమ్ముడు అని లేదు. ఇది కావాలని మార్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు.

ఇక పుష్ప 2 సినిమాకు అన్ని చోట్ల సూపర్ హిట్ టాక్ వచ్చింది. సినిమా లో అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. జాతర సీన్ తో పాటు ప్రీ క్లైమాక్స్ ఫైట్ లో కూడా అల్లు అర్జున్ నటన యాక్షన్ గూస్ బంప్స్ తెప్పించేస్తాయి. మొత్తానికి సుకుమార్, అల్లు అర్జున్ 3 ఏళ్ల కష్టానికి తగిన ఫలితం వచ్చిందని చెప్పొచ్చు. పుష్ప 2 తో పాటు పుష్ప 3 అని కూడా చెప్పి ఆడియన్స్ కు షాక్ ఇచ్చాడు సుకుమార్.

Tags:    

Similar News