పుష్ప 2 కోసం సాలిడ్ బిజినెస్ ప్లాన్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ మొదటి వారం థియేటర్స్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే

Update: 2024-10-15 09:23 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ డిసెంబర్ మొదటి వారం థియేటర్స్ లోకి రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా 550 కోట్ల థీయాట్రికల్ బిజినెస్ ఈ సినిమాపై జరిగినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. తాజాగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమా గురించి ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్ అదిరిపోయిందని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. దీంతో సినిమా మీద ఎక్స్ పెక్టేషన్స్ మరింత పెరిగిపోయాయి. నార్త్ ఇండియాలో ఈ మూవీ అద్భుతాలు చేస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. అలాగే ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ని కూడా ‘పుష్ప 2’ బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ గురించి సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ టాక్ నడుస్తోంది. డిసెంబర్ 6న అనుకున్న రిలీజ్ డేట్ డిసెంబర్ 5కి కన్ఫర్మ్ అయ్యిందనే మాట బలంగా వినిపిస్తోంది.

మేకర్స్ దీనిపై త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నట్లు టాక్. యూఎస్ లో డిసెంబర్ 4న స్పెషల్ ప్రీమియర్ షోలు వేయనున్నారంట. అలాగే డిసెంబర్ 4 రాత్రి 9:30 గంటలకి స్పెషల్ ప్రీమియర్ షోలు నార్త్ ఇండియాతో పాటు తెలుగు రాష్ట్రాలలో వేయబోతున్నారనే ప్రచారం నడుస్తోంది. దాంతో పాటు డిసెంబర్ 5 అర్ధరాత్రి 1 గంటకి మొదటి ఆట వేయబోతున్నారంట. అంటే స్పెషల్ ప్రీమియర్ షోలతో పాటు మిడ్ నైట్ షో, ఎర్లీ మార్నింగ్ షో కూడా ‘పుష్ప2’ కి పడనున్నాయని ఇండస్ట్రీలో మాట్లాడుకుంటున్నారు.

సినిమా పైన ఉన్న అంచనాల నేపథ్యంలో మేకర్స్ ఒకరోజు ముందుగానే రిలీజ్ ప్లాన్ చేయడమే కాకుండా ప్రీమియర్ షోలు కూడా వేయడానికి సిద్ధం అవుతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో చెప్పుకుంటున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. స్పెషల్ ప్రీమియర్స్, బెన్ ఫిట్ షోల ప్లానింగ్ చూస్తుంటే మొదటి రోజు 200+ కోట్లకి పైగా కలెక్షన్స్ ని ఎట్టి పరిస్థితిలో అందుకోవాలని లక్ష్యంతో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

టికెట్ ధరలు కూడా తెలుగు రాష్ట్రాలలో పెంచుకోవడానికి పర్మిషన్ ఇస్తారు. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ పేరు మీద ఉన్న ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని కూడా ‘పుష్ప 2’ బ్రేక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉందని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు. ‘దేవర’ మూవీనే మొదటి రోజు ఏకంగా 154 కోట్లకి పైగా గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంది. భారీ అంచనాలు మధ్య రాబోతున్న ‘పుష్ప 2’ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్స్ రాబడుతుందనేది ఆడియన్స్ అంచనాలకి వదిలేయడమే.

Tags:    

Similar News