పుష్ప 2- ఏం చెప్పబోతున్నారు?

ఇదిలా ఉంటే ప్రమోషన్స్ లో భాగంగా ‘పుష్ప 2’ నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ కలిపి నేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.

Update: 2024-10-24 05:35 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయిపొయింది. థీయాట్రికల్, నాన్ థీయాట్రికల్ బిజినెస్ కలిపి 1000 కోట్లు దాటిందనే మాట వినిపిస్తోంది. ఇండియన్ హిస్టరీలో అత్యధిక ప్రీరిలీజ్ బిజినెస్ ఈ సినిమాకి జరిగిందని ప్రచారం జరుగుతోంది.


దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. కచ్చితంగా ఈ మూవీ అద్భుతాలు సృష్టిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు. హిందీలో మోస్ట్ ఇంటరెస్టింగ్ మూవీగా ‘పుష్ప 2’ ఉంది. దీనికోసం నార్త్ ఇండియన్ ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ప్రమోషన్స్ ని మేకర్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

నెక్స్ట్ మూవీ నుంచి రాబోయే అప్డేట్స్ కూడా సినిమాపైన మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెంచే విధంగా ఉంటాయని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రమోషన్స్ లో భాగంగా ‘పుష్ప 2’ నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ కలిపి నేషనల్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్రకటన రిలీజ్ చేశారు. ఈ నేషనల్ ప్రెస్ మీట్ లో రీజనల్ మీడియా జర్నలిస్ట్ లతో పాటు నేషనల్ మీడియా రిపోర్ట్రర్స్ కూడా పాల్గొంటారు. రెగ్యులర్ ప్రమోషన్ లో చిత్ర యూనిట్ కి ఇది మొదటి అడుగు.

ఈ ప్రెస్ మీట్ లో నిర్మాతలు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సినిమా ప్రమోషన్స్ లో ఎప్పుడైనా మేకర్స్ తో పాటు యాక్టర్, టెక్నీషియన్స్ పాల్గొంటారు. అయితే ‘పుష్ప 2’ ప్రమోషనల్ ప్రెస్ మీట్ లో నిర్మాతలు, డిస్టిబ్యూటర్స్ పాల్గొనబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమా ప్రీరిలీజ్ బిసినెస్ గురించి ఈ ప్రెస్ మీట్ లో ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది తెలియాల్సి ఉంది.

టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో 1000+ కోట్ల కలెక్షన్స్ రావడం పక్కా అని సినీ విశ్లేషకులు అంటున్నారు. సుకుమార్ ఈ చిత్రాన్ని చాలెంజింగ్ గా తీసుకొని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. బన్నీకి పుష్కరాజ్ క్యారెక్టర్ నేషనల్ అవార్డు తీసుకొచ్చింది. దీంతో ‘పుష్ప 2’ కోసం మరింత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News