సోషల్ మీడియా.. పుష్ప 2 పూనకాలు..!

రిలీజ్ ముందు ఒక సినిమాను ఆడియన్స్ లో ఎంత ఎక్కించాలో మన మేకర్స్ కు బాగా తెలుసు.

Update: 2024-12-02 09:41 GMT

రిలీజ్ ముందు ఒక సినిమాను ఆడియన్స్ లో ఎంత ఎక్కించాలో మన మేకర్స్ కు బాగా తెలుసు. అందుకే వేరే భాషల సినిమాలు రిలీజ్ టైం కన్నా మన తెలుగు సినిమాల పాన్ ఇండియా రిలీజ్ టైం లో హంగామా ఒక రేంజ్ లో ఉంటుంది. సినిమా తీయడం గొప్ప కాదు ఆ సినిమాను ఇలా ప్రతి ఆడియన్ కు తెలిసేలా ప్రమోట్ చేయడం గొప్ప విషయం ఆ విషయంలో అందరు సక్సెస్ అవుతున్నారు. ఈ క్రమంలోనే 3 రోజుల్లో రిలీజ్ కాబోతున్న పుష్ప 2 బజ్ ఒక రేంజ్ లో ఉంది.

ఎక్కడ చూసినా.. ఎవరిని టచ్ చేసినా పుష 2 గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా అయితే పుష్ప 2 పూనకాలతో రచ్చ చేస్తుంది. పుష్ప 2 లో ఈమధ్యనే శ్రీలీల చేసిన దెబ్బలుపడతాయ్ రో సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా వైరల్ అయ్యింది. ప్రతి ఒక్కరు తమ సోషల్ మీడియాలో ఈ సాంగ్ ని వాడేస్తూ రీల్స్ చేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా రిలీజైన పీలింగ్స్ సాంగ్ కొత్తగా ట్రెండింగ్ లోకి వచ్చింది. దెబ్బలుపడతాయ్ రో వేడి తగ్గక ముందే పీలింగ్స్ సాంగ్ పిచ్చెక్కించేందుకు వచ్చింది. ముఖ్యంగా పక్కా మాస్ మసాలా సాంగ్ గా వచ్చిన ఈ పాటలో రష్మిక అందాల ప్రదర్శన ఆ సాంగ్ ని మళ్లీ మళ్లీ చూసేలా చేస్తుంది. ఈ సాంగ్ ని కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

ఇలా సినిమాలో సాంగ్స్ రిలీజ్ కు ముందే ట్రెండింగ్ లో ఉంటే ఆ సినిమాకు ఎంత పాజిటివ్ బజ్ వస్తుందో చెప్పాల్సిన పనిలేదు. పుష్ప 2 సినిమాకు నార్త్ సైడ్ బీభత్సమైన క్రేజ్ ఏర్పడింది. అందుకు తగినట్టుగానే ఈ సాంగ్స్ ఉండటంతో అంచనాలు మరింత పెరిగాయి. కచ్చితంగా ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ రికార్డులను సృష్టించే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. పుష్ప 2 సినిమా దాదాపు 12 వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీగానే ఉన్నాయి. సో సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం అల్లు అర్జున్ స్టామినా పాన్ ఇండియా బాక్సాఫీస్ పై మోత మోగిస్తాడని చెప్పొచ్చు. సాంగ్స్ విషయంలో దేవి మీద పెట్టుకున్న నమ్మకాన్ని మరోసారి నిలబెట్టాడని చెప్పొచ్చు. రిలీజ్ తర్వాత పుష్ప ట్రెండింగ్ ఎలా ఉంటుందో కానీ ప్రీ రిలీజ్ హంగామా మాత్రం వేరే లెవెల్ అనిపిస్తుంది.

Tags:    

Similar News