పుష్ప 2 బాక్సాఫీస్: రపా రపా 400 కోట్లు!
ముఖ్యంగా నార్త్ లో ప్రమోషన్ మాత్రం గట్టిగానే పని చేసింది. ఊహించిన దానికంటే సాలీడ్ రికార్డులు నమోదవుతున్నాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ రెండో రోజు కూడా తన హవాను కొనసాగిస్తోంది. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అస్సలు తగ్గడం లేదు. రపా రపా.. అనే పుష్ప రాజ్ డైలాగ్ కు తగ్గట్లే నెంబర్లు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నార్త్ లో ప్రమోషన్ మాత్రం గట్టిగానే పని చేసింది. ఊహించిన దానికంటే సాలీడ్ రికార్డులు నమోదవుతున్నాయి.
హిందీ వెర్షన్ మొదటి రోజు 72కోట్ల నెట్ వసూళ్లతో ఉహించని థ్రిల్ ఇస్తోంది. రెండో రోజు కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఈజీగా ఆఫ్ సెంచరీ కొట్టేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి భారీ ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు డ్రాప్ రావడం సహజం, కానీ ఈ సినిమాకు పెద్దగా డ్రాప్ అయితే కనిపించడం లేదు.
రెండు రోజుల్లో హిందీ వెర్షన్ సాధించిన మొత్తం 120 కోట్ల నెట్ వద్ద నిలుస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ రేంజ్‌లో వసూళ్లు రావడం సినిమా బ్లాక్‌బస్టర్ అయినట్టే అని ప్రూవ్ చేస్తోంది. అయితే, శనివారం కలెక్షన్లు మరింతగా పెరగడం ఈ సినిమాకు కీలకమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. శనివారం మరియు ఆదివారం కలెక్షన్లు భారీగా పెరిగితే, పుష్ప 2 హిందీ మార్కెట్‌లో మరో న్యూ రికార్డ్ ను అందుకునే అవకాశం ఉంది.
వారాంతం నాటికి సినిమా లెక్క ఉహించని నెంబర్ కు చేరుకునే అవకాశం అయితే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా రెండవ రోజు కలెక్షన్స్ స్టడీగానే ఉన్నాయి. ముఖ్యంగా నైజాంలో మొదటి రోజే టాప్ రికార్డ్ ను అందుకుంది. ఇక రెండో రోజు కూడా అదే దూకుడు కనిపించింది. ఇక ఓవర్సీస్ లెక్కలు కూడా అస్సలు తగ్గడం లేదు. ఫైనల్ గా సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల గ్రాస్ మార్క్‌ను అధిగమించడం విశేషం. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం మాములు విషయం కాదు.
మరోసారి హిందీ మార్కెట్ ప్రాధాన్యతను కూడా రుజువు చేసింది. హిందీ మార్కెట్ లేకుండా ఏ సినిమాకైనా 1000 కోట్ల క్లబ్ చేరడం సవాల్‌గా మారింది. పుష్ప 2 లోని హిందీ వెర్షన్ సక్సెస్ సినిమా విజయాన్ని మరింత బలపరిచింది. ఈ లెవెల్లో కలెక్షన్లు రావడం అంటే అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్‌లో కూడా ఎంతలా పెరిగిందో చెప్పవచ్చు. ఇక సినిమా ఇప్పటికే వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరడానికి అవసరమైన బేస్‌ను సెట్ చేసింది.
సినిమా మాస్ మార్కెట్లలో కొన్ని చోట్ల మొదటి రోజుతో పోలిస్తే కాస్త డ్రాప్ కనిపించినా, అక్కడే వసూళ్లు ఇప్పటికీ రికార్డు స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా మార్కెట్‌లోని నేషనల్ చైన్స్ అయితే కేవలం 20% మాత్రమే డ్రాప్ ఉండడం విశేషం. ఇది రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత బలపడే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్ట్‌లు భావిస్తున్నారు. మొత్తానికి, పుష్ప 2 హిందీ మార్కెట్‌తో పాటు సౌత్‌లోనూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. మూడవ రోజు మరియు నాలుగవ రోజు కలెక్షన్లు కీలకమని చెప్పవచ్చు. ఆరంభంలో సాధించిన కలెక్షన్ల హవాను కొనసాగిస్తూ సినిమా ఇంకెన్ని రికార్డులు బద్దలుకొడుతుందో చూడాలి.