ఒక్క ఇండియాలోనే పుష్పకు రూ.1000 కోట్లా?

అల్లు అర్జున్ లేని సీన్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Update: 2024-07-26 00:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోపాటు వరల్డ్ వైడ్ గా ఉన్న సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న పుష్ప-2 గురించి కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. బన్నీ, సుకుమార్ మధ్య విభేదాలు తలెత్తాయని, మూవీ షూటింగ్ ఆగిపోయిందని రూమర్లు వినిపించాయి. కానీ వాటిలో నిజం లేదని క్లారిటీ వచ్చేసింది. జస్ట్ బన్నీ.. తన ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ కు వెళ్లారని తెలిసింది. అతి త్వరలో షూటింగ్ మళ్లీ మొదలు కానున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ లేని సీన్స్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ చేయనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. సుకుమార్ ఇప్పటికే అమెరికా నుంచి వచ్చేసి షూటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసేశారట. అయితే పుష్ప-2కు సంబంధించి ఓ ఐటమ్ సాంగ్ తోపాటు కొన్ని యాక్షన్ సీన్స్ పెండింగ్ ఉన్నాయని సమాచారం. ట్రిప్ నుంచి వచ్చాక అల్లు అర్జున్ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. అలా అనుకున్న తేదీకి ప్యాకప్ చెప్పాలని మేకర్స్ భావిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.

ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సిన పుష్ప-2 డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇటీవల మూవీ డేట్ పై మరోసారి బన్నీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1000 కోట్లు వసూలు చేస్తుందని అంతా అంచనా వేస్తున్నారు. ట్రేడ్ పండితులు కూడా అదే అభిప్రాయ పడుతున్నారు. ఇప్పుడు బాలీవుడ్ లో పుష్ప-2 రూ.500 కోట్లు కచ్చితంగా.. ఈజీగా వసూలు చేస్తుందని బీటౌన్ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

ఇప్పుడు మరో విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటి వరకు కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు వసూలు చేసిన ఏకైక సినిమా బాహుబలి-2. ప్రభాస్ హీరోగా రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు పుష్ప-2.. బాహుబలి-2 రికార్డును బ్రేక్ చేస్తుందని బీటౌన్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. హిందీ బెల్ట్ లో రూ.500 కోట్లు సాధిస్తే.. ఇండియాలో రూ.1000 కోట్లు రాబట్టడం ఈజీ అని అంటున్నారు.

కొందరు మాత్రం పుష్ప-2 హిందీలో రూ.500 కోట్లు వసూలు చేస్తుందని వేస్తున్న అంచనాలు.. సరైనవి కావని చెబుతున్నారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం.. పుష్ప ఫస్ట్ పార్ట్ కు వచ్చిన రెస్పాన్స్, ఇప్పుడు సీక్వెల్ పై ఉన్న హైప్, అల్లు అర్జున్ స్టామినా, పాజిటివ్ మౌత్ టాక్.. ఈ అంశాలతో పుష్ప-2 రూ.500 కోట్లు వసూలు చేయడం గ్యారెంటీ అని చెబుతోంది. ఇప్పుడు ఈ విషయం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News