పుష్ప 2 షూట్ మధ్యలో వదిలేసి..!
ఇక అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడిన స్నేహారెడ్డిపై అపారమైన ప్రేమాభిమానాలు ఎప్పుడూ అభిమానుల్లో చర్చకు తావిస్తుంటాయి.
అవును.. అల్లు అర్జున్ పుష్ప2 షూట్ మధ్యలో వదిలేసాడు. వదిలేసి చేసిన నిర్వాకం ఏమిటి? అంటే.. ఇదిగో పూర్తి వివరాల్లోకి వెళ్లాలి. మోస్ట్ అవైటెడ్ పుష్ప 2 షూటింగ్ కే బ్రేక్ ఇచ్చాడు.. అంటే అతడు చేసిన పనిలో పురుషార్థం ఉందని అర్థమైపోతోంది. అతడు వచ్చింది తన సతీమణి కోసం... అక్కడ ఏం చేసాడంటే?
అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో ఉన్నారు. ఇక అల్లు అర్జున్ ప్రేమించి పెళ్లాడిన స్నేహారెడ్డిపై అపారమైన ప్రేమాభిమానాలు ఎప్పుడూ అభిమానుల్లో చర్చకు తావిస్తుంటాయి. ఇప్పుడు తన సతీమణి కోసం బన్ని షూటింగ్ మధ్యలో వచ్చారు.
వ్యాపార రంగాల్లో ఎప్పుడూ ముందుండే అల్లు కుటుంబం నుంచి అల్లు స్నేహారెడ్డి స్థాపించిన పికాబు సంస్థ సమర్పిస్తున్న ఫైర్ ఫ్లై కార్నివల్ ని ఈ రోజు ఎన్ కన్వెన్షన్ లో నిర్వహించగా ఈవెంట్ నిర్వాహకులకు బ్లెస్సింగ్ ఇవ్వడానికి బన్ని దిగొచ్చారు. అల్లు ఫ్యామిలీ కార్నివాల్ ని గ్రాండ్ గా చేయడం కోసం పికాబు సంస్థ టాప్ స్టిచ్ సంస్థతో జతకట్టింది. ఈ కార్నివాల్ కి ముఖ్య అతిధి గా వచ్చిన అల్లు అర్జున్ అల్లు... స్నేహ రెడ్డి ఇతర భాగస్వాములు నాగు రెడ్డి , స్మిత రెడ్డి కి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ .. పుష్ప 2 షూట్ మధ్యలో నుంచి వచ్చాను. ఈ ఫైర్ ఫ్లై కార్నివాల్ ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అల్లు స్నేహ రెడ్డి, నాగు రెడ్డి, స్మిత రెడ్డి కి అభినందనలు. ఈ కార్యక్రమం ని ఇంత సపోర్ట్ చేసిన మీడియా కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. బన్ని తిరిగి పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొననున్నారు.