పుష్ప 2 - 1000 కోట్ల టార్గెట్ కు దారి దొరికినట్లే..

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ తన క్రేజ్ మరింత పెరిగేలా గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు

Update: 2024-03-04 13:30 GMT

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ తన క్రేజ్ మరింత పెరిగేలా గట్టిగా ప్లాన్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పుష్ప సీక్వెల్ మరింత హై రేంజ్ లో ఉండాలి అని దర్శకుడు సుకుమార్ కూడా చాలా గట్టిగా కష్టపడుతున్నారు అనే చెప్పాలి. ఇక మైత్రి మూవీ మేకర్స్ కూడా ఖర్చుకు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పుష్ప 2 ను అత్యంత భారీ స్థాయిలో తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది.

ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా పుష్ప సౌండ్ గట్టిగా వినపడాలని అనుకుంటూ ఉన్నారు. ఇక అల్లు అర్జున్ కూడా వివిధ దేశాలకు వెళ్లి అక్కడ పుష్ప పేరు కూడా ట్రెండ్ అయ్యేలా చేస్తూ ఉన్నాడు. మరోవైపు రష్మిక కూడా ఇతర దేశాల్లో జరుగుతున్న ఫిలిం ఫెస్టివల్ లో పాల్గొంటూ అక్కడ కూడా పుష్ప 2 ఉనికిని చాటి చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పుష్ప సెకండ్ పార్ట్ మాత్రం 1000 కోట్ల బాక్సాఫీస్ టార్గెట్ ను అందుకోవాలి అని అల్లు అర్జున్ కోరుకుంటూ ఉన్నాడు.

సుకుమార్ మైత్రి కూడా వారికి కూడా ఇది డ్రీమ్ టార్గెట్ అని చెప్పవచ్చు. అయితే లేటెస్ట్ గా వస్తున్న టాక్ ప్రకారం పుష్ప 2కు ఇది సాధ్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అనిపిస్తోంది. మొన్నటి వరకు సినిమా బిజినెస్ ఎలా ఉంది ఎంతవరకు వెళ్ళవచ్చు అనే విషయంలో పెద్దగా చర్చలేమీ జరగలేదు. ఇక ప్రస్తుతం మైత్రి కాంపౌండ్ లో పుష్ప సినిమాకు గట్టి ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే మైత్రి వారు కూడా డీల్స్ విషయంలో తొందరపడకుండా పక్క ప్రణాళికతో బిజినెస్ చేయాలని అనుకుంటున్నారు. ఇక థియేట్రికల్ గా అలాగే నాన్ థియేట్రికల్ గా ఈ సినిమా దాదాపు 700 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే పుష్ప 2 బాక్సాఫీస్ వద్ద మినిమం టాప్ అందుకున్న కూడా 1000 కోట్ల బిజినెస్ చేసిన సినిమాగా మరొక రికార్డును క్రియేట్ చేస్తుంది.

అల్లు అర్జున్ కూడా 1000 కోట్ల మార్కెట్ అందుకున్న టాప్ హీరోల్లో టాప్ ఇండియన్ హీరోల్లో ఒకరిగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇక మైత్రి సంస్థ కూడా తన ఉనికిని మరింత పెంచుకునేందుకు ఈ రికార్డు ఉపయోగపడుతుంది. మరి ఆ దిశగా పుష్ప 2 వీరి కోరికను నెరవేరుస్తుందో లేదో చూడాలి.

Tags:    

Similar News