పుష్ప 2.. ఎక్కడా స్పెస్ లేదు!

బాహుబలి 3 తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి ఎక్కువ యాక్షన్ బేస్డ్ మూవీస్ వచ్చాయి.

Update: 2024-07-30 10:30 GMT

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898ఏడీ సూపర్ సక్సెస్ అందుకొని వరల్డ్ వైడ్ గా 1100 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. నెల రోజుల తర్వాత కూడా ఈ సినిమాకి డీసెంట్ వసూళ్లు వస్తూ ఉండటం విశేషం. కల్కి సినిమా బజ్ అయితే చాలా వరకు తగ్గిందని చెప్పొచ్చు. ఇప్పుడు ఫ్యాన్స్ ఫోకస్ అంతా ది రాజాసాబ్ సినిమాపైనే పడింది. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

బాహుబలి 3 తర్వాత డార్లింగ్ ప్రభాస్ నుంచి ఎక్కువ యాక్షన్ బేస్డ్ మూవీస్ వచ్చాయి. రాధేశ్యామ్ సినిమా లవ్ స్టోరీతో తెరకెక్కిన ప్రేక్షకులని మెప్పించలేదు. డార్లింగ్, ఏక్ నిరంజన్ తరహాలో డార్లింగ్ ప్రభాస్ నుంచి ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు. కల్కి 2898ఏడీ సినిమాలో భైరవ క్యారెక్టర్ లో ప్రభాస్ కాస్తా ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ది రాజాసాబ్ సినిమాలో పూర్తిస్థాయిలో ప్రభాస్ వినోదం పండించబోతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇందులో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించడంతో పాటు హ్యాండ్సమ్ లుక్ లో మెస్మరైజ్ చేశాడు. ఈ లుక్ చూసిన తర్వాత ది రాజాసాబ్ మూవీపై ఫ్యాన్స్ కి ఆసక్తి పెరిగింది. ఈ సినిమాని ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. నిజానికి సంక్రాంతికి వస్తుందని అందరూ ఎక్స్ పెక్ట్ చేశారు. అయితే సమ్మర్ హాలిడేస్ ని యూజ్ చేసుకోవాలని అనుకున్నట్లు అర్ధమవుతోంది.

ఇదిలా ఉంటే ది రాజాసాబ్ సినిమాని 2025 ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేయడంతో పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ కి అడ్డుకట్ట పడిందనే టాక్ వినిపిస్తోంది. నిజానికి పుష్ప ది రూల్ చిత్రాన్ని డిసెంబర్ 6న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే సుకుమార్ ప్రస్తుతం మూవీ ఎడిటింగ్ వర్క్ పైన కూర్చున్నారు. షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. దీంతో డిసెంబర్ 6న కూడా రిలీజ్ కష్టమనే ప్రచారం తెరపైకి వచ్చింది.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో 'పుష్ప ది రూల్' ని రిలీజ్ చేయనున్నట్లు బాలీవుడ్ డిస్టిబ్యూటర్ కి నిర్మాతలు తెలియజేసినట్లు బిటౌన్ లో ప్రచారం జరిగింది. అదే వాస్తవం అయితే ఇప్పుడు పుష్ప ది రూల్ ఏప్రిల్ రిలీజ్ కి, ది రాజాసాబ్ బ్రేక్ వేసినట్లే అని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ సినిమాకి పోటీగా పుష్ప 2 ని రిలీజ్ చేసే సాహసం చేయకపోవచ్చనే మాట వినిపిస్తోంది.

కాబట్టి పుష్ప 2 అనుకున్న టైమ్ కు రావాలి లేదంటే సమ్మర్ తరువాత రావాలి. మధ్యలో కూడా ఎక్కడా గ్యాప్ లేదు. సంక్రాంతికి మెగాస్టార్, వెంకీ లాంటి సీనియర్ హీరోలు ఉన్నారు. ఇక ఆ తరువాత అంటే పరీక్షల కాలం కాబట్టి రిస్క్ తీసుకోరు. ఏప్రిల్ పర్ఫెక్ట్ ఛాయిస్ అని అనుకుంటే ప్రభాస్ బుక్ చేసుకున్నాడు. ఈక్రమంలో పుష్ప రాజ్ కు డిసెంబర్ తప్ప మరో ఛాన్స్ లేదు. మరింత ఆలస్యం అయితే నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News