పుష్ప-2.. అన్నీ ఆలోచించే..

ఇప్పుడు పుష్ప-2, గేమ్ ఛేంజర్ ఒకే రోజు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాషే అని గుసగుసలు వినిపించాయి.

Update: 2024-06-18 04:33 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 మళ్లీ పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15వ తేదీన విడుదలవుతున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో పుష్ప సీక్వెల్ వాయిదా పక్కా అని అంతా ఫిక్స్ అయిపోయారు. అనుకున్నట్లే నిన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. డిసెంబర్ 6వ తేదీన పుష్ప-2 రిలీజ్ చేయనున్నట్లు అఫీషియల్ గా ప్రకటించింది.

అనేక నెలలుగా సినిమా షూటింగ్ జరుగుతున్నా.. ఇంకా పెండింగ్ ఉందని మైత్రీ సంస్థ తెలిపింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కు కూడా టైమ్ పడుతుందని, అందుకే ఆగస్టు 15న సినిమాను విడుదల చేయలేకపోతున్నామని చెప్పింది. మంచి క్వాలిటీతో మూవీని అందించాలన్నదే తమ టార్గెట్ అని వెల్లడించింది. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప-2 వాయిదా కోసమే చర్చ నడుస్తోంది.

వాస్తవానికి.. పుష్ప-2 డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ అవ్వనుందని జోరుగా చర్చ సాగింది. కానీ అదే రోజు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విడుదల చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్లు కూడా టాక్ వినిపించింది. ఎందుకంటే క్రిస్మస్ తోపాటు లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని గేమ్ ఛేంజర్ మేకర్స్ ఆ నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు పుష్ప-2, గేమ్ ఛేంజర్ ఒకే రోజు రిలీజ్ అయితే బాక్సాఫీస్ వద్ద పెద్ద క్లాషే అని గుసగుసలు వినిపించాయి.

దాంతోపాటు ఇటీవల ఏపీ ఎన్నికల ప్రచార సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి ఇంటికి వెళ్లడం.. ఆ తర్వాత పవన్ గెలిచాక అల్లు ఫ్యామిలీ నుంచి ఎవరూ విష్ చేయకపోవడం.. మెగా పవర్ సెలబ్రేషన్స్ కు ఎవరూ రాకపోవడం.. ఇలా పలు సందర్భాలను ఎగ్జాంపుల్ గా చూపించి రెండు కుటుంబాల మధ్య గ్యాప్ పెరిగిందని అంటున్నారు. అదే సమయంలో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య చాలా డిస్టెన్స్ వచ్చిందని కూడా టాక్ వినిపిస్తోంది.

ఇలాంటి సమయంలో పుష్ప-2ను డిసెంబర్ 20వ తేదీన సినిమా విడుదల చేయడం కరెక్ట్ కాదని భావించి... అదే నెల 6వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే క్రిస్మస్, లాంగ్ వీకెండ్ ను పుష్ప-2 మిస్ అవుతుంది. కానీ మూవీపై ఉన్న హైప్ కాపాడుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. దానికి తోడు డిసెంబర్ సెంటిమెంట్ కూడా కలిసి వస్తుందనే ఆశతో ఉన్నారు. మరి ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News