చీర కట్టి చిన్నది భలే క్యూట్‌ ఉన్నది

ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ తన సొంతం అంటూ ఈ అమ్మడు నిరూపించింది.

Update: 2024-10-17 23:30 GMT

అక్కినేని వారి 'మనం' సినిమాలో చిన్న పాత్రలో నటించడం ద్వారా టాలీవుడ్‌ కు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌గా మారిన రాశి ఖన్నా తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే స్టార్‌ హీరోలకు జోడీగా మాత్రం ఈ అమ్మడికి నటించే అవకాశాలు దక్కలేదు. ముందు ముందు ఈ అమ్మడు టాలీవుడ్‌ లో మళ్లీ బిజీ అవ్వాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ తన సొంతం అంటూ ఈ అమ్మడు నిరూపించింది.


ఊహలు గుసగుసలాడే సినిమాలో హీరోయిన్‌గా నటించిన ఈ అమ్మడు ఆ తర్వాత వెంటనే జోరు, జిల్‌ సినిమాల్లో నటించింది. కెరీర్‌ ఆరంభంలో కాస్త బరువు ఎక్కువగా ఉన్న రాశి ఖన్నా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో రాణించాలంటే బరువు తక్కువ ఉండాలి, సన్నగా నాజూకుగా ఉండాలని బరువు తగ్గింది. బరువు తగ్గిన తర్వాత రాశి ఖన్నా మరింత అందంగా కనిపించింది. దాంతో యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారింది. ఒకానొక సమయంలో ఖాళీ లేనంత బిజీగా సినిమాలు చేయడం ద్వారా కొన్ని సినిమాలను వదులుకోవాల్సి వచ్చిందట. ఇప్పుడు మాత్రం కోలీవుడ్‌లో ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది.


ఇండస్ట్రీలో ఈ అమ్మడి జోరు తగ్గిందని అనుకున్న ప్రతిసారీ ఏదో ఒక మంచి సినిమా పడుతుంది. దాంతో తిరిగి పుంజుకుంటూ ఉంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈమె సందడి కనిపించడం లేదు. అయినా కూడా భవిష్యత్తులో తిరిగి వరుస సినిమాలు చేయడం ఖాయం అంటూ ఇలాంటి ఫోటోలు చూసిన సమయంలో అనిపిస్తుంది. తాజాగా ఈమె షేర్‌ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఆకట్టుకునే అందంతో పాటు చీర కట్టులో భలే క్యూట్‌గా ఉంది అంటూ నెటిజన్స్ నుంచి ప్రశంసలు దక్కించుకుంటూ ఉంది. అందంతో పాటు అభినయం ఈమె సొంతం. చీర కట్టులో చక్కని క్యూట్‌ అందం ఈమె సొంతం అని నిరూపితం అయింది.


సాధారణంగా హీరోయిన్స్ మోడ్రన్‌ డ్రెస్‌ ల్లో, స్కిన్‌ షో చేసిన ఫోటో షూట్స్ వైరల్‌ అవుతాయి. కానీ రాశి ఖన్నా ఇలా సింపుల్‌ గా చీర కట్టులో కనిపించినా వైరల్‌ అవుతోంది. స్కిన్‌ షో చేయకుండానే అందంగా కనిపిస్తూ కవ్విస్తున్న రాశి ఖన్నా ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందంగా కనిపిస్తున్న రాశి ఖన్నాను ఎందుకు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు పట్టించుకోవడం లేదు అంటూ ఆమె ఫ్యాన్స్ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా టాలీవుడ్‌ లో రాశి ఖన్నా వరుస సినిమాలు చేయాలని ఆమె ఫ్యాన్స్ ఆశ పెట్టుకున్నారు. మరి రాశి ఖన్నాకు పూర్వ వైభవం దక్కేనా చూడాలి.

Tags:    

Similar News