ఫిలింపేర్ పై రాశుల మ‌యం!

డిజైన‌ర్ ఎంపిక‌ల్లో త‌న‌దైన మార్క్ వేస్తుంటుంది. తాజాగా రాశీ అందాల‌న్నీ ఫిలిం ఫేర్ మ్యాగ‌జైన్ కోసం అలా ప‌రిచేసింది. అమ్మ‌డు మ్యాగజైన్ కోసం వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది.

Update: 2023-12-13 15:01 GMT

అందాల రాశీఖ‌న్నా టార్గెట్ ఇప్పుడు కోలీవుడ్..బాలీవుడ్ మాత్ర‌మే. అవ‌కాశాలున్నంత కాలం టాలీవుడ్ లో బిజీగా ఉన్న అమ్మ‌డు ఇప్పుడు పూర్తిగా ఆ రెండు భాష‌ల్నే టార్గెట్ గా ఫిక్స్ చేసింది. చెన్నై టూ ముంబై తిరుగుతూ రెండు భాష‌ల్ని మ్యానేజ్ చేస్తుంది. అప్పుడ‌ప్పుడు హైద‌రాబాద్ లో ఇండ‌స్ట్రీ ప్రెండ్స్ ని ట‌చ్ చేస్తూ ట‌చ్ లో ఉంచుకుంటుంది. ఇండ‌స్ట్రీలో ట‌చ్ లో ఉండ‌టం అన్న‌ది అతి ముఖ్యం కాబ‌ట్టి ఆ ర‌కంగా రాశీ అంద‌ర్ని క‌లుపుకుని పోతుంది.


కోలీవుడ్..బాలీవుడ్ లో క‌లిపి రెండు సినిమాలు చేస్తోంది. అవ‌న్నీ ఆన్ సెట్స్ లో ఉన్నాయి. వాటి రిలీజ్ పై చాలా ఆశ‌లే పెట్టుకుంది. టాలీవుడ్ లో ఛాన్సులు లేని నేప‌థ్యంలో ఉన్న వాటితోనైనా హిట్ అందుకు ని కెరీర్ లో బిజీగా నాయిక‌గా మారాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక గ్లామ‌ర్ వ‌ర‌ల్డ్ లో ఎలా మెల‌గాలో? రాశీకి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. స్టైల్ కా బాప్ అనిపించే ఫోటో షూట్ల‌తో ఎప్ప‌టిక‌ప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారుతుంటుంది.


డిజైన‌ర్ ఎంపిక‌ల్లో త‌న‌దైన మార్క్ వేస్తుంటుంది. తాజాగా రాశీ అందాల‌న్నీ ఫిలిం ఫేర్ మ్యాగ‌జైన్ కోసం అలా ప‌రిచేసింది. అమ్మ‌డు మ్యాగజైన్ కోసం వివిధ భంగిమ‌ల్లో కెమెరాకి ఫోజులిచ్చింది. మోనోక్రోమ్ థీమ్‌లో సొగ‌స‌రి సౌందర్యాన్ని ప్రదర్శించిన వైనం సంథింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. ఓ డిజైన్ లో వెండి ఆభరణాలతో కూడిన అలంకరణ ఎంతో ఆక‌ట్టుకుంటుంది. మ‌రో పిక్ లో నలుపు రంగు దుస్తుల్లో టాప్ టూ బాట‌మ్ రాశీ భంగిమ అంతే అల‌రిస్తుంది.


రాశీ అలా స్టైలిష్ గా చైర్ లో కూర్చుని కెమారాకి వివిధ భంగిమ‌ల్లో ఫోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. రాశీ అభిమానులు బ్యూటీని అలా చూసి స్ట‌న్ అయిపోతున్నారు. రాశీ అందాన్ని ఆకాశానికి ఎత్త‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు.


Tags:    

Similar News