తుఫాన్‌ లు ఏంటి? నరాలు లాగడం ఏంటి రాశి?

సోషల్‌ మీడియాలో రాశి ఖన్నా వ్యాఖ్యల గురించి కొందరు మీమ్స్ చేసి ట్రోల్స్ చేస్తూ ఉంటే, మరి కొందరు డైరెక్ట్‌ గానే మరీ ఎటకారం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2023-11-28 14:30 GMT

హీరో, హీరోయిన్స్‌, సినిమాకు చెందిన ఇతర టెక్నీషియన్స్ మరియు నటీనటులు ఇలా ప్రతి ఒక్కరు కూడా తాము చేసిన సినిమా గురించి ఆహా ఓహో అంటూ మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. చాలా మంది ఒక మోస్తరు వరకు అతి కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ కొందరు మాత్రం అంతకు మించి అన్నట్లుగా, నమ్మశక్యం లేని విధంగా మాట్లాడుతూ ఉంటారు.

తాజాగా హీరోయిన్ రాశి ఖన్నా చేసిన వ్యాఖ్యలు అంతకు మించి కేటగిరీలో ఉంటాయి అన్నట్టు కొందరు విమర్శలు చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో రాశి ఖన్నా వ్యాఖ్యల గురించి కొందరు మీమ్స్ చేసి ట్రోల్స్ చేస్తూ ఉంటే, మరి కొందరు డైరెక్ట్‌ గానే మరీ ఎటకారం అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకు రాశి ఖన్నా ఏమన్నది అనే విషయానికి వస్తే... తాజాగా ఆమె విక్రమ్‌ మాస్సే తో కలిసి 'టీఎంఈ' అనే సినిమాలో నటించింది. ఆ సినిమా షూటింగ్‌ ని ముగించిన రాశి ఖన్నా షూటింగ్‌ అనుభవాలను షేర్‌ చేసుకుంది. షూటింగ్‌ సమయంలో నటీ నటులు, సాంకేతిక నిపుణులతో బాండింగ్ ఏర్పడటం అనేది చాలా కామన్‌ విషయం.

కొందరు షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కన్నీళ్లు పెట్టుకుని సెట్స్ నుంచి వెళ్లి పోవడం మనం చూశాం. అయితే తాజాగా ఆ సినిమా షూటింగ్ గురించి రాశి ఖన్నా మాట్లాడుతూ.. నా హృదయానికి ఎంతో దగ్గరైన టీమ్‌ 'టీఎంఈ'. ఈ సినిమాలోని నా పాత్ర ఎవరి ఊహకు కూడా అందనంత అద్భుతంగా ఉంటుంది. కథ లో నా పాత్ర తో అద్భుతమైన ట్విస్ట్‌ లు ఉంటాయి.

కెమెరా ముందుకు వెళ్లి నా పాత్రలో నటిస్తున్న సమయంలో నరాలు లాగినట్లు గా అనిపించేది. నా మనసులో తుఫాన్‌ లు చెలరేగినట్లుగా అనిపించేది. ఆ పాత్ర లో నటిస్తున్న సమయంలో నన్ను నేను కంట్రోల్‌ చేసుకోవడానికి చాలా కష్టపడేదాన్ని. ఆ షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత తేరుకోవడానికి చాలా సమయం పట్టేది. ఆ సమయంలో విక్రమ్‌ నాకు అండగా నిలిచాడు అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.

కెమెరా ముందుకు వెళ్లినప్పుడు నరాలు లాగడం ఏంటి, తుఫాన్ లు చెలరేగడం ఏంటి రాశి అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో టీఎంఈ చిత్ర యూనిట్‌ సభ్యులతో ఉన్న ఫోటోలను షేర్‌ చేసి రాశి ఖన్నా ఈ వ్యాఖ్యలు చేసింది.

Tags:    

Similar News