ఫోటో స్టోరి: దివి నుంచి దిగి వచ్చిన అందాల రాశి
అందమైన మ్యాచింగ్ బ్లౌజ్‌తో పాటు బ్లూ డిజైన్లతో కూడిన గోల్డెన్ లెహంగాను ఎంపిక చూపరులను కట్టి పడేస్తోంది.
అందాల రాశీఖన్నా... పేరులోనే ఉంది రాశి. దానికి తగ్గట్టుగానే తన యాటిట్యూడ్ ఫ్యాషన్ సెన్స్ కుర్రకారు గుండెల్ని ఛిద్రం చేస్తోంది. అందానికి అందం ప్రతిభతో దశాబ్ధ కాలంగా అసాధారణ ఫాలోయింగ్ సంపాదించుకున్న రాశీఖన్నా కెరీర్ పరంగా అప్స్ డౌన్స్ తో సంబంధం లేకుండా ధీటైన ప్రణాళికతో నెగ్గుకొస్తోంది. అవకాశం ఉన్నా లేకపోయినా లైమ్ లైట్ లో ఎలా ఉండాలో రాశీకి స్పష్ఠంగా తెలుసు. ఓవైపు తెలుగు చిత్రపరిశ్రమలో మరోవైపు తమిళ చిత్రసీమలో అలాగే హిందీ పరిశ్రమలో తెలివిగా మూడుముక్కలాట ఆడుతోంది.
గేమ్ కి తగ్గట్టే ప్రచారార్భాటం.. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో తనకు తాను ప్రచారం ఎలా పెంచుకోవాలో రాశీ ఎత్తుగడలు ప్రతిసారీ ఆశ్చర్యపరుస్తున్నాయి.. ఈ భామ ఇతరుల కంటే యూనిక్ గా హాట్ కంటెంట్ ని షేర్ చేస్తూనే సాంప్రదాయ దుస్తుల్లోనూ మెస్మరైజ్ చేస్తోంది.
తాజాగా రాశీఖన్నా దేశీ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. భారీతనం నిండిన డిజైనర్ లెహంగాలో రాశీ వన్నె చిన్నెలు హృదయాల్ని హత్తుకుంటున్నాయి. అందమైన మ్యాచింగ్ బ్లౌజ్‌తో పాటు బ్లూ డిజైన్లతో కూడిన గోల్డెన్ లెహంగాను ఎంపిక చూపరులను కట్టి పడేస్తోంది. రాశీ మంత్రముగ్ధం చేసే రూపానికి తగ్గ డిజైనర్ లుక్ ఇది అంటూ కితాబు అందుకుంటోంది. ఎంపిక చేసుకున్న లెహంగాకు తగ్గట్టే మేకప్ సంవిధానం యాప్ట్ అయింది. రాశీ అందాన్ని సరికొత్త స్థాయికి చేర్చింది. ఈ ఫోటోషూట్ కి అభిమానులు లవ్ - హార్ట్ ఈమోజీలతో తమ అభిమానం కురిపించారు. ప్రస్తుతం ఈ లుక్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ఫర్జీ వెబ్ సిరీస్ లో అద్భుత నటనతో ఆకట్టుకున్న రాశీ, అటుపై హిందీ చిత్రసీమలో బిజీ అవుతోందని ప్రచారమైంది. అయితే తన కొత్త ప్రాజెక్టుల గురించి రాశీ ఇంకా ప్రకటించలేదు. ఇంతలోనే రాజ్ అండ్ డీకేతో మరో చిత్రానికి కమిటైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే దేనికీ అధికారిక కన్ఫర్మేషన్ లేదు. రాశీ ఏం చెబుతుందో చూడాలి.