రాయన్.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం రాయన్.
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ 50వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రం రాయన్. ఆయన స్వీయ దర్శకత్వంలోనే రాయన్ మూవీ ఏకంగా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. మాస్ యాక్షన్ కథాంశంతో ఈ సినిమాని ధనుష్ సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. ఇలాంటి కథలకి తమిళనాట మంచి ఆదరణ ఉంటుంది. అలాగే ధనుష్ హీరో వస్తోన్న సినిమా కావడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
ట్రైలర్ కి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాకి ఆశించిన స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. దీంతో మొదటిరోజు భారీ కలెక్షన్స్ రాబట్టడం కష్టం అనే మాట వినిపించింది. దానికి విరుద్ధంగా రాయన్ మూవీ మొదటి రోజు కలెక్షన్స్ ఉండటం విశేషం. ఈ సినిమా ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 23.40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ధనుష్ ఇమేజ్ పరంగా చూసుకుంటే ఇది చాలా పెద్ద నెంబర్ అని తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ఈ చిత్రం 1.6-1.8 కోట్ల మధ్యలో గ్రాస్ కలెక్షన్స్ అందుకుంటుందని భావించారు. అయితే అనూహ్యంగా 2.6 కోట్ల గ్రాస్ మొదటి రోజు రాయన్ మూవీ తెలుగు రాష్ట్రాలలో అందుకుంది. ఆయన డబ్బింగ్ సినిమాలలో అత్యధిక ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవే కావడం విశేషం. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ అయ్యింది. మొదటి రోజు కలెక్షన్స్ లెక్కన చూసుకుంటే మరో 4.14 కోట్ల షేర్ అందుకుంటే మూవీ హిట్ బొమ్మగా మారుతుంది.
ఇప్పటి వరకు 1.36 కోట్ల షేర్ ని శుక్రవారం అందుకుంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో శని, వరాల కలెక్షన్స్ పెరుగుతాయనే మాట వినిపిస్తోంది. ఇక తమిళనాడులో ఈ మూవీ మొదటి రోజు 10.80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ముఖ్యంగా రాయన్ సినిమాకి సింగిల్ స్క్రీన్స్ లో ఎక్కువ ప్రేక్షకాదరణ లభించినట్లు తెలుస్తోంది. ఓవరాల్ గా చూసుకుంటే 23.40 కోట్ల గ్రాస్ ని మొదటి రోజు రాయన్ సినిమా వసూళ్లు చేయగా అందులో 11.20 కోట్ల షేర్ ఉంది.
46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ఈ టార్గెట్ అందుకోవాలంటే 34.80 కోట్ల షేర్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీకెండ్ తర్వాత కూడా మంచి కలెక్షన్స్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అయ్యి క్లీన్ హిట్ గా నిలిచే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
తమిళనాడు – 10.80Cr
తెలుగు స్టేట్స్- 2.60Cr
కర్ణాటక- 1.95Cr
కేరళ – 0.95Cr
హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా – 0.55Cr
ఓవర్సీస్ – 6.55CR****