ఫోటో స్టోరి: పొట్టి నిక్క‌రులో బోల్డ్ బ్యూటీ

మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో రాగిణి స్పెష‌ల్ ఫోటోషూట్లు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా రాగిణి షేర్ చేసిన ఇన్ స్టా ఫోటోషూట్ వెబ్ లో దూసుకెళుతోంది.

Update: 2024-05-11 04:15 GMT

రాగిణి ద్వివేది ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఈ క‌న్న‌డ బ్యూటీ ప‌లు తెలుగు చిత్రాల్లోను నటించింది. కానీ శాండ‌ల్వుడ్ డ్ర‌గ్స్ స్కాండ‌ల్ లో అరెస్ట్ అయిన‌ప్పుడు రాగిణి పేరు విస్త్ర‌తంగా మీడియా హెడ్ లైన్స్ లోకి వ‌చ్చింది. రాగిణి జైలు జీవితం అనంత‌రం బెయిల్ పై విడుద‌ల‌య్యారు. ఇప్పుడు తిరిగి న‌టిగా తన కెరీర్ ని పున‌రుద్ధ‌రించే ప‌నిలో ఉంది. ప్ర‌స్తుతం హిందీ స‌హా క‌న్న‌డ చిత్రాల్లో రాగిణి రీలాంచ్ అవుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాల్లో రాగిణి స్పెష‌ల్ ఫోటోషూట్లు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. తాజాగా రాగిణి షేర్ చేసిన ఇన్ స్టా ఫోటోషూట్ వెబ్ లో దూసుకెళుతోంది.

 

దీనికి రాగిణి అంద‌మైన క్యాప్ష‌న్ ఇచ్చింది. ''అనాలోచితంగా(అన‌పాల‌జిటికల్లీ) మెజెస్టిక్'' అంటూ క్రౌన్ ఈమోజీల‌ను రాగిణి షేర్ చేసింది. పాపుల‌ర్ క‌న్న‌డ‌ మ్యాగజైన్ కోసం పుట్టినరోజు ఎడిషన్ ఇది. కర్ణాటక 'చిత్రసంతే' మ్యాగజైన్ 125వ ప్రత్యేక కవర్ షూట్ ఇది అంటూ తెలిపింది. ఏస్ ఫోటోగ్రాఫర్ కిర‌ణ్ వెంకటరమణప్ప ఈ ఫోటోషూట్ సూత్ర‌ధారి అని రాగిణి తెలిపారు. బ్లాక్ క‌ల‌ర్ డెనిమ్ నిక్క‌రు ధ‌రించిన రాగిణి .. కాంబినేష‌న్ స్కార్ప్ టాప్ లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. రాగిణి డేర్ డెవిల్ బోల్డ్ ఫోటోషూట్ల‌కు మారుపేరు. అలాంటి మ‌రో హాట్ ఫోటోషూట్ ఇది.

 

రాగిణి ద్వివేది 'ఫెమినా మిస్ ఇండియా' ర్యాంప్ నుండి కన్నడ చిత్ర పరిశ్రమలో ప్ర‌వేశించిన బ్యూటీ. మిరుమిట్లు గొలిపే లైట్నింగ్ కాంతుల న‌డుమ మోడ‌ల్ గా రాణించి, అటుపై న‌టిగా కెరీర్ ని ప్రారంభించింది. ఈ ప్రయాణం త‌న‌ ప్రతిభకు, పట్టుదలకు, అభిరుచికి నిదర్శనం. మోడల్‌గా కెరీర్ ప్రారంభించి, లాక్మే ఫ్యాషన్ వీక్, శ్రీలంక ఫ్యాషన్ వీక్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్ల‌లో షైన్ అయిన రాగిణి వేగంగా ఫ్యాషన్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసింది. రోహిత్ బాల్, తరుణ్ తహిలియాని, సభ్య‌సాచి ముఖర్జీ వంటి ప్రఖ్యాత డిజైనర్లతో త‌న‌ అనుబంధం స్టైల్ ఐకాన్ హోదాను మరింత పటిష్టం చేసింది.

న‌టిగా విల‌క్ష‌ణ‌త గ్లామ‌ర్ కోణం రాగిణిని స్టార్‌డమ్ దిశ‌గా న‌డిపించాయి. ఫెమినా మిస్ ఇండియాలో పాల్గొని విజయం సాధించిన తర్వాత, మిస్ బ్యూటిఫుల్ హెయిర్ బిరుదును పొందింది. రాగిణి 'వీర మదకరి' సినిమాతో వెండితెర అరంగేట్రం చేసింది. కెంపె గౌడ, శివ, రాగిణి IPS వంటి చిత్రాలలో అద్భుత‌ నటనతో ఆక‌ట్టుకుంది. కన్నడ ప‌రిశ్ర‌మ‌లో పాపుల‌ర్ క‌థానాయిక‌గా స్థిర‌ప‌డింది.

రాగిణి సామాజిక కార్య‌క్ర‌మాల‌తోను పాపుల‌ర్ అయింది. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద స్వచ్ఛ నగర ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేసింది. బెంగ‌ళూరుకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా కొన‌సాగింది. పర్యావరణంపై త‌న‌కున్న మక్కువ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఉత్పత్తి అయిన నందిని మిల్క్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా అవ‌కాశం క‌ల్పించింది.ముంబైలోని ఇండియా లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో మోస్ట్ ప్రామిసింగ్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా సహా అనేక పుర‌స్కారాలు పొందింది.

Tags:    

Similar News