ఎన్టీఆర్ తో సినిమా.. లక్ తగిలినట్టే..!
కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ తో ఎన్.టి.ఆర్ భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
పాన్ ఇండియా రేసులో దూసుకెళ్లాలని చూస్తున్న యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ సినిమాల విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నారు. RRR తో అదుర్స్ అనిపించిన తారక్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా విషయంలో ఎక్కడ లెక్క తగ్గకుండా చూసుకుంటున్నారు మేకర్స్. ఈ మూవీ తర్వాత ఎన్.టి.ఆర్ ఒక యువ దర్శకుడితో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న డైరెక్టర్ తో ఎన్.టి.ఆర్ భారీ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట.
ఇంతకీ ఎవరా డైరెక్టర్ అంటే ప్రతిభ గల దర్శకుడు రాహుల్ సంకృత్యన్ అని తెలుస్తుంది. విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమా చేసిన రాహుల్ ఆ తర్వాత నానితో శ్యామ్ సింగ రాయ్ చేశాడు. రెండు సినిమాలు కమర్షియల్ గా హిట్ అయ్యాయి. తను ఎంచుకున్న కథను తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు రాహుల్. ఈ క్రమంలో రాహుల్ ఎన్టీఆర్ కోసం ఒక పీరియాడికల్ డ్రామా స్టోరీ రాసుకున్నాడట. ఈ కథలో చాలా హై మూమెంట్స్ ఉంటాయని తెలుస్తుంది.
మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మించబోతున్నారని టాక్. దేవర తర్వాత ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు ఒక కథ చెప్పగా దానికి నో చెప్పిన తారక్ రాహుల్ చెప్పిన కథకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే ఇప్పటికే ఎన్.టి.ఆర్ దేవర పూర్తి చేయాల్సి ఉంది ఆ తర్వాత వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా కూడా లైన్ లో ఉన్నాయి. వార్ 2 నెక్స్ట్ ఇయర్ మొదట్లో సెట్స్ మీదకు వెళ్తుంది. ఆ సినిమా తో పాటుగా ప్రశాంత్ నీల్ సినిమా కూడా ప్లానింగ్ లో ఉంది.
ప్రశాంత్ నీల్ సినిమా తర్వాత రాహుల్ సినిమా ఉంటుందా లేదా 3 సినిమాలు ఒకేసారి ప్లాన్ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది. రాహుల్ పీరియాడికల్ డ్రామా తో తారక్ ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని డీటైల్స్ త్వరలో బయటకు వస్తాయి. ఎన్టీఆర్ మైత్రి మూవీ మేకర్స్ రాహుల్ సంకృత్యన్ ఈ కాంబో సినిమా అనౌన్స్ మెంట్ రోజే ఒక కాన్సెప్ట్ టీజర్ ప్లాన్ చేస్తున్నారట. సినిమా అనుకున్న విధంగా వర్క్ అవుట్ అయితే మాత్రం రాహుల్ కూడా స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరతారని చెప్పొచ్చు.