సిటాడెల్.. సామ్ కష్టాలు అన్నీ ఇన్నీ కావు!

స్టార్ హీరోయిన్ సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.

Update: 2024-10-24 08:30 GMT

స్టార్ హీరోయిన్ సమంత త్వరలో సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఆ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా లీడ్ రోల్ పోషించారు. ఇప్పటికే అన్ని వర్క్స్ పూర్తి చేసుకున్న సిటాడెల్.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా నవంబర్ 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. దీంతో వెబ్ సిరీస్ టీమ్.. ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా గడుపుతోంది.

అయితే సమంత కొన్నాళ్ల క్రితం మయోసైటిస్ బారిన పడ్డ సంగతి విదితమే. ఆ సమయంలో తన చేతిలో ఉన్న సిటాడెల్ సిరీస్ తో పాటు పలు ప్రాజెక్టులు పూర్తి చేసిన ఆమె.. విదేశాలకు వెళ్లిపోయారు. కొన్ని రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకుని రీసెంట్ గా ఇండియాకు వచ్చేశారు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమయంలోనే ఆమె సిటాడెల్ షూట్ లో పాల్గొన్నారు. అప్పుడు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఇప్పటికే పలుమార్లు సమంత తెలిపారు.

ఇప్పుడు ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజ్ మాట్లాడారు. సిటాడెల్ షూటింగ్ సమయంలో సమంత.. ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అసలేం ఏమవుతుందో తమకు అర్థం కాలేదని అన్నారు. కొన్ని రోజుల తర్వాత.. సామ్ మయోసైటిస్ బారిన పడినట్లు తెలిసిందని చెప్పారు. అనేక సార్లు.. సమంత కోసం తాము వెయిట్ చేసేవాళ్లమని తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల ఆమె బాగా లేట్ గా సెట్స్ కు వచ్చేవారని వెల్లడించారు.

స్పృహ తప్పి పడిపోయారా లేదా ఇంకేమైందో తెలిసేది కాదని రాజ్ తెలిపారు. అదే ఇంటర్వ్యూలో సమంత వర్క్ కమిట్మెంట్ వేరే లెవెల్ లో ఉంటుందని వరుణ్ ధావన్ కొనియాడారు. ఎన్నో సమస్యలు ఎదురైనా.. వాటిని గట్టిగా ఎదుర్కొని సమంత షూట్ కంప్లీట్ చేశారని చెప్పారు. సమంత అద్భుతమైన నటి అని, చాలా ప్రొఫెషనల్‌ గా ఉంటారని పేర్కొన్నారు. ఎప్పుడూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనలో ఉంటారని వరుణ్ అన్నారు.

ప్రస్తుతం రాజ్ కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సిటాడెల్ విషయంలో సమంత చాలా కష్టపడినట్లు తెలుస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఎంతైనా సామ్ చాలా గ్రేట్ అని అంటున్నారు. యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌ సిరీస్‌ గా తెరకెక్కిన సిటాడెల్ లో స్పై ఏజెంట్ గా సమంత కనిపించనున్నారు. రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ విడుదల చేయగా.. మంచి ప్రశంసలు అందుకున్నారు. మరి సిరీస్ స్ట్రీమ్ అయ్యాక ఎలాంటి హిట్ దక్కించుకుంటారో చూడాలి.

Tags:    

Similar News