SSMB29: అప్డేట్ అడిగితే కొట్టబోయిన జక్కన్న

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా చేస్తున్నారు.

Update: 2024-09-11 10:41 GMT

ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా వెరైటీగా చేస్తున్నారు. ఇండస్ట్రీలో యంగ్ హీరోలు, దర్శకులు తమ క్రియేటివ్ టాలెంట్ కి పదును పెట్టి ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా సినిమాకి ప్రమోషన్స్ చేస్తూ హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా శ్రీసింహ హీరోగా తెరకెక్కిన మత్తు వదలరా 2 చిత్ర ప్రమోషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నారు.

మత్తు వదలరా సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రితేష్ రానా దర్శకత్వంలోనే ఈ మత్తువదలరా పార్ట్ 2 కూడా తెరకెక్కింది. ఈ సినిమాకి కాల భైరవ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరూ కలిసి సినిమా ప్రమోషన్స్ కోసం ఒక వీడియో చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

అవుట్ ఫుట్ లు అన్ని ఇచ్చేశాం. రిలీజ్ కి ఇంకా ఎక్కువ టైం లేదు. గట్టిగా ఏదో ఒక సౌండ్ చేయాలి. ఎం చేద్దాం అంటూ కాల భైరవ శ్రీసింహని అడుగుతాడు. ఇద్దరు కలిసి రాజమౌళి ఇంటికి వెళ్తారు. అప్పుడే కార్తికేయ బయటకి వస్తాడు. రాజమౌళిని కలవాలని శ్రీసింహ, కాల భైరవ ట్రై చేస్తుంటే కార్తికేయ అడ్డుకుంటాడు. అంతలో రాజమౌళి బయటకొచ్చి గొడవేంటి అని అడుగుతాడు. మా సినిమా గురించి గట్టిగా సౌండ్ చేయాలని అనుకుంటున్నాం అని శ్రీసింహ చెబుతాడు.

సెప్టెంబర్ 13న మత్తువదలరా 2 రిలీజ్ అవుతోంది. థియేటర్స్ కి వచ్చేయండి అని రాజామౌళి చెబుతాడు. తరువాత SSMB29 అప్డేట్ ఏమైనా ఇస్తారా అని శ్రీసింహ రాజమౌళిని అడుగుతాడు. దానికి రాజమౌళి పెద్ద కర్ర తీసుకొని శ్రీసింహ, కాల భైరవని కొట్టడానికి వస్తాడు. మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన ఈ వీడియో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

వీడియోలో కూడా SSMB29 మూవీ అప్డేట్ ఇవ్వకుండా జక్కన్న తప్పించుకున్నారు అంటూ సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు కూడా మూవీ షూటింగ్ కోసం సిద్ధమై ఉన్నారు. జక్కన్న నుంచి గ్రీన్ సిగ్నల్, అఫీషియల్ అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది.

Full View
Tags:    

Similar News