SSMB29: మళ్ళీ ఇదెక్కడి ట్విస్టు జక్కన్న?

సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2024-10-18 04:26 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ వరల్డ్ రేంజ్ లో సిద్ధం కానున్న ఈ సినిమా అప్డేట్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందనే టాక్ బయటకొచ్చింది. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్ కి తగ్గట్లుగా మహేష్ బాబు మేకోవర్ అయ్యారు. లాంగ్ హెయిర్, గెడ్డంతో డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. రెగ్యులర్ గా అన్ని ఈవెంట్స్ కి మహేష్ బాబు ఇదే లుక్ లో అటెండ్ అవుతున్నాడు.

అయితే మహేష్ బాబు సిద్ధమై ఉన్న జక్కన్న మాత్రం ‘SSMB29’ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ప్రీప్రొడక్షన్ వర్క్ అయితే జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో జక్కన్న ఉన్నారని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు. ఒకేసారి ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా అప్డేట్ ఇవ్వాలని జక్కన్న అనుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఆల్ మోస్ట్ వచ్చే ఏడాదిలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వొచ్చని అంటున్నారు.

ఏకంగా 1500 కోట్లకి పైగా బడ్జెట్ తో ఈ సినిమాని కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. హాలీవుడ్ యాక్టర్స్ ని కూడా ఈ మూవీ కోసం రంగంలోకి దించుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. ‘బాహుబలి’ తరహాలోనే ‘SSMB29’ కూడా రెండు భాగాలుగా చేయాలని జక్కన్న డిసైడ్ అయ్యారంట. సినిమా బడ్జెట్ ని దృష్టిలో ఉంచుకొని బిజినెస్ కోసం ఇలా రెండు భాగాలుగా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనే సందేహం అందరికి కలుగుతోంది.

రెండు భాగాలకి కలిపి 1500 కోట్ల వరకు బడ్జెట్ అయ్యే అవకాశం ఉండొచ్చని టాక్. జక్కన్న ఒక సినిమా చేయడానికి కనీసం ఐదేళ్లు టైమ్ తీసుకుంటాడు. ఇంకా రెండు సినిమాలు అంటే కనీసం 10 ఏళ్ళు పట్టేయొచ్చని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాల అనుభవం ఉంది కాబట్టి ‘SSMB29’ ని రెండు భాగాలుగా చేసిన వీలైనంత వేగంగా పూర్తి చేయడానికి స్కోప్ ఉందని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత అనేది మేకర్స్ ప్రకటిస్తే గాని తెలియదు. ఒక వేళ రెండు భాగాలుగా చేసిన కూడా జక్కన్న పర్ఫెక్ట్ మార్కెటింగ్ ప్లాన్ తో మూవీస్ ని రిలీజ్ చేస్తారు. కాబట్టి బిజినెస్ పరంగా ఎలాంటి టెన్షన్ ఉండదని ట్రేడ్ పండితులు అంటున్నారు. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఈ ప్రాజెక్ట్ కారణంగా చాలా ఏళ్ళు జక్కన్న దగ్గర స్టక్ అయిపోవడం గ్యారెంటీ అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News