డియోమాలిక్ పై రాజ‌మౌళి మ‌న‌సులో మాట‌!

# ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ఎలాంటి లోకేష‌న్ల‌లో షూటింగ్ చేస్తారు? అన్న‌ది ముందే రివీల్ చేసేసారు రాజ‌మౌళి.;

Update: 2025-03-20 14:51 GMT

# ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం ఎలాంటి లోకేష‌న్ల‌లో షూటింగ్ చేస్తారు? అన్న‌ది ముందే రివీల్ చేసేసారు రాజ‌మౌళి. ప్రాజెక్ట్ మొద‌ల‌వ్వానికి ముందే కెన్యా స‌హా ఆప్రికా అడవుల్ని సైతం చుట్టేసారు. లొకేష‌న్ల హంటింగ్ లో భాగంగా ఇదంతా జ‌రిగింది. తొలుత షూటింగ్ అల్యుమిన‌యం ఫ్యాక్ట‌రీలో మొద‌లు పెట్ట‌డం..అక్క‌డ నుంచి ఆర్ ఎఫ్ సీలో షూటింగ్ చేసారు.

అనంత‌రం ఒడిశాలోని కోరాపూట్ లో రెండు వారాల పాటు షూటింగ్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా కోరాపూట్ హిల్స్ ను హైలైట్ చేస్తూ రాజ‌మౌళి ట్వీట్ చేసారు. ఒడిశాల్లోని అత్యంత ఎత్తైద‌న అద్భుత‌మైన శిఖ‌రం డియోమాలిక్ ట్రెకింగ్ చేయ‌డం గొప్ప అనుభూతినిచ్చింద‌న్నారు. పై నుంచి చూస్తే కింద‌కు చూస్తే ఎంతో అద్భుతంగా ఉంద‌న్నారు. అయితే శిఖర‌మంతా చెత్తా చెదారంగా ఉండ‌టంతో కాస్త నిరుత్సాహాన్ని కూడా వ్య‌క్తం చేసారు.

ఇలాంటి స‌హ‌జ‌మైన వాతావ‌ర‌ణంతో కూడిన అందాల్ని అద్భుతంగా చూసుకోవాలి. దీని గురించి ఏ ఒక్క పౌరుడు బాధ్య‌త తీసుకున్న అందంగా మారుతుంది. ట్రెకింగ్ ఎవ‌రు చేసినా ఎవ‌రి చెత్త వారే తీసుకుని వెళ్తే మంచిద‌ని సూచించారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అయితే ఈ స్పాట్ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి షూటింగ్ స్పాట్ కావ‌డంతో? ఇక‌పై ట్రెకింగ్ చేయ‌డానికి మ‌రింత మంది ఉత్సాహం చూపిస్తారు.

గొప్ప ప‌ర్యాట‌క ప్రాంతంగా కోరాపూట్ హిల్స్ మారే అవ‌కాశం ఉంది. ఇండియాలోనే ఎన్నో గొప్ప అద్భుత మైన లొకేష‌న్లు ఉన్నాయి. వాటిని వినియోగించుకోల్గితే ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా ప్ర‌దేశాల‌కు ప్రాముఖ్య‌త ఏర్ప‌డుతుంది. ప్ర‌తీ రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా ఇలాంటి ప‌ర్యాట‌క ప్ర‌దేశాల విష‌యంలో సానుకూలంగానే ఉంటుంది.

Tags:    

Similar News