ఈమె అమీర్ ఖాన్ హీరోయిన్ తెలుసా?

రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే న‌టిగా ప‌రిచ‌య‌మైన షామా శికంద‌ర్ కెరీర్ ఆరంభ‌మే అమీర్ ఖాన్ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించింది.;

Update: 2025-03-21 03:35 GMT
ఈమె అమీర్ ఖాన్ హీరోయిన్ తెలుసా?

రెండు ద‌శాబ్ధాల క్రిత‌మే న‌టిగా ప‌రిచ‌య‌మైన షామా శికంద‌ర్ కెరీర్ ఆరంభ‌మే అమీర్ ఖాన్ సినిమాలో ఒక కీల‌క పాత్ర‌లో న‌టించింది. అయితే 2000ల నాటి ప్రముఖ నటి త‌న‌ నటనను వదిలేసి కెరీర్ శిఖరాగ్రంలో జీవితాన్ని ముగించాలని నిర్ణ‌యించుకుంది. అస‌లు షామా జీవిత ప్ర‌యాణం ఎలా సాగింది? అన్న‌ది ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలిసాయి.


సినిమా - టెలివిజన్ రెండింటిలోనూ తమదైన ముద్ర వేసిన షామా ఇటీవ‌ల‌ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో కూడా కొన్ని మ‌ర‌పురాని పాత్ర‌ల‌తో అల‌రించింది. నిజానికి షామా త‌న బాల్యంలో తిండికి లేని రోజుల‌ను గ‌డిపింది. ఆమె జీవితం లోతుల్లోకి వెళితే చాలా సినిమా క‌ష్టాలున్నాయి. త‌న‌ అసలు పేరు షామా సికందర్ అలీ గేసావత్. 42 సంవత్సరాల వయస్సులో కూడా ఈ బ్యూటీ తనదైన అందం, ధైర్యంతో యువ నటీమణులతో పోటీప‌డుతోంది. షామా 4 ఆగస్టు 1981న రాజస్థాన్‌ మక్రానాలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది.

ఒక త్రోబ్యాక్ ఇంటర్వ్యూలో షామా త‌న‌ 10 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడుకోవడం విన్నానని వెల్లడించింది. భోజ‌నం కొనడానికి తమ ఇంట్లో డబ్బు లేదని తన తల్లిదండ్రులు క‌ల‌త చెందిన రోజులు ఉన్నాయ‌ని అంది. షామా సికందర్‌కు తొమ్మిది సంవత్సరాల వయసులో కుటుంబం మెరుగైన‌ ఉద్యోగ అవకాశాల కోసం ముంబైకి వెళ్లింది. పదేళ్ల వయసులో తాను చూసిన పోరాటాల కారణంగా, షామా చిన్నప్పటి నుండే డబ్బు ప్రాముఖ్యతను అర్థం చేసుకుంది. ముంబైలోని రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్ నుండి నటనలో గ్రాడ్యుయేషన్ డిగ్రీని పొందింది. 1995లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత 1998లో ప్రేమ్ అగ్గన్ చిత్రంతో బాలీవుడ్‌లో తన నటనా రంగ ప్రవేశం చేసింది.

కేవలం 17 సంవత్సరాల వయసులో గ్లామ‌ర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. త‌న‌దైన అందం నటప్ర‌తిభ‌తో పెద్ద నిర్మాతలు దర్శకుల దృష్టిని ఆకర్షించింది. 1999లో ఆమిర్ ఖాన్- మనీషా కొయిరాలాతో కలిసి మన్ చిత్రంలో నటించే అవ‌కాశం ల‌భించింది. ఇంద్ర‌కుమార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. ఇది షామాకు ఒక గొప్ప అరుదైన‌ క్షణం. ఆ తర్వాత వ‌ర‌స‌గా క్రేజీ ప్రాజెక్టులు లభించాయి. తరువాత యే మొహబ్బత్ హై, అన్ష్: ది డెడ్లీ పార్ట్, బస్తీ, ధూమ్ దడక్కా, కాంట్రాక్ట్, బైపాస్ రోడ్ స‌హా మరెన్నో హిట్ చిత్రాలలో నటించింది. నేడు సోష‌ల్ మీడియాల్లో భారీ క్రేజ్ ఉన్న బ్యూటీగా వెలిగిపోతోంది. విదేశీ ప్రియుడు జేమ్స్ మిల్లిరాన్ తో ఈ భామ జీవితం హాయిగా, ల‌గ్జ‌రియ‌స్ గా సాగిపోతోంది.

Tags:    

Similar News