ఇండియాలో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడు!
హాలీవుడ్ లో అవకాశం అంటే అంత ఈజీ కాదు. ఎంతో ట్యాలెంట్ ఉంటే తప్ప సాధ్యం కానిది. అలా ఉన్నా? లక్ కూడా కలిసొస్తేనే ఛాన్స్ ఉంటుంది
హాలీవుడ్ లో అవకాశం అంటే అంత ఈజీ కాదు. ఎంతో ట్యాలెంట్ ఉంటే తప్ప సాధ్యం కానిది. అలా ఉన్నా? లక్ కూడా కలిసొస్తేనే ఛాన్స్ ఉంటుంది. ఇలా ఈ రెండు ఉన్న ఇండియన్ ఎవరైనా ఉన్నారా? అంటే ఒక్కడు ఉన్నాడని చెప్పొచ్చు. అతనే దర్శకశిఖరం ఎస్ .ఎస్ రాజమౌళి. అవును...జక్కన్నకి హాలీవుడ్ లో కూడా సినిమాలు డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. `నాకు అవకాశం వచ్చింది కానీ నేనే వెళ్లలేదు అని రాజమౌళి అంటే అతిగా ఉంటుంది`.
అందుకే ఈ విషయం ఆయన ఎక్కడా ఇంతవరకూ ఓపెన్ అవ్వలేదు. రామ్ చరణ్..ఎన్టీఆర్ లకు అవకాశాలు వచ్చాయన్నారు తప్ప! తనకి మాత్రం ఛాన్స్ వచ్చిందన్న సంగతి మాత్రం ఇంత కాలం హైడ్ చేసారు. తాను దాచేస్తే మాత్రం దాగుతుందా? అది ఏదో రూపంలో బయటకు పొక్కదా? ఇప్పుడదే జరిగింది. నేరుగా చిత్ర నిర్మాత కె. ఎల్ నారాయణ ఈ విషయాన్ని బహిర్గతం చేసారు. రాజమౌళికి హాలీవుడ్ లో అవకాశాలొచ్చినా ఆయన వెళ్లలేదు. తెలుగు సినిమాలు డైరెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఆయన గొప్ప అవకాశాలు వచ్చినా వెళ్లలేదని తెలిపారు.
ఇది నిజంగా గొప్ప విషయమే. హాలీవుడ్ లో పిలిచి అవకాశం ఇస్తే ఎవరైనా వదులుకుంటారా? కళ్లకు హత్తుకుని మరీ అమెరికా ప్లైట్ ఎక్కేస్తారు. ఇండియాలో ఎంతో మంది గ్రేట్ డైరెక్టర్లు ఉన్నారు. అద్భుతమైన కథలు... సాంకేతికంగా ఉన్నంతంగా తెరకెక్కించగల క్రియేటివ్ డైరెక్టర్స్ ఉన్నారు. కానీ వాళ్లెవ్వరికీ సాధ్యం కానిది జక్కన్నకి సాధ్యమైంది. ఇది కదా? తెలుగు సినిమా గర్వం అంటే! అవును ఈ మాట మనం చెప్పడం కాదు. రాజమౌళి బాలీవుడ్ లోనో..హాలీవుడ్ లో నో ఉండాలని రాంగోపాల్ వర్మ సైతం ఓ సందర్భంలో అన్నారు.
`బాహుబలి` ప్రాంచైజీ రిలీజ్ అయిన తర్వాత జక్కన్న ఉండాల్సింది ఇక్కడ కాదు? ఇంకెక్కడో ఉండాలంటూ ఓపెన్ గానే చెప్పారు. హాలీవుడ్ రాజమౌళి ట్యాలెంట్ ని గుర్తించక ముందే వర్మ గుర్తించాడు. `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ తర్వాత జేమ్స్ కామెరాన్ లాంటి దిగ్గజాలతోనే జక్కన్న ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాతే రామ్ చరణ్ కి..ఎన్టీఆర్ కి హాలీవుడ్ నుంచి కూడా పిలుపొచ్చింది.