రాజమౌళి కూడా తగ్గాల్సి వచ్చింది..

టాలీవుడ్ సినిమా గురించి చెప్పడం మొదలు పెడితే కొంతమంది పేర్లు కచ్చితంగా ప్రస్తావించుకోవాలి.

Update: 2024-08-06 05:25 GMT

టాలీవుడ్ సినిమా గురించి చెప్పడం మొదలు పెడితే కొంతమంది పేర్లు కచ్చితంగా ప్రస్తావించుకోవాలి. శివ సినిమాతో రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమాకి కమర్షియల్ హంగులు అద్దాడు. అంత వరకు ఒకే రీతిలో ఉండే తెలుగు కథాశైలిని పూర్తిగా మార్చేసి హీరో అనేవాడు ఎలా ఉన్న పాత్రలో దమ్ముంటే చూస్తారని ప్రూవ్ చేశాడు. అదొక ట్రెండ్ సెట్టర్ మూవీ. రామ్ గోపాల్ వర్మ శైలి ఇప్పటికి టాలీవుడ్ లో కొనసాగుతోంది. ఆ తర్వాత టాలీవుడ్ లో అత్యంత ప్రభావిత దర్శకుడు అంటే రాజమౌళి పేరు కచ్చితంగా చెప్పుకోవాలి.

తెలుగు సినిమా స్టాండర్డ్స్ ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. ఈ రోజు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ నుంచి మొట్టమొదటి సారిగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్న సినిమా అంటే ఆర్ఆర్ఆర్ పేరు వినిపిస్తోంది. బాహుబలి సిరీస్ తో ఆస్కార్ అవార్డుల కోసం పోటీ పడలేదు. అయితే బాహుబలి సినిమా వెనుక రాజమౌళి తో పాటు టీమ్ కష్టం చాలా ఉందని చెప్పాలి.

నిజానికి టాలీవుడ్ లో సినిమాలకి 100 కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది మొదటిసారి బాహుబలి 1 సినిమాని ఏకంగా 180 కోట్ల బడ్జెట్ తో రాజమౌళి తెరకెక్కించారు. ఆర్కా మీడియా కూడా కంటెంట్ డిమాండ్ మేరకు ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టుకుంటూ వెళ్లారు. తాజాగా మోడ్రన్ మాస్టర్స్ అనే డాక్యుమెంటరీ రాజమౌళి జర్నీ గురించి వచ్చింది. ఇందులో బాహుబలి సినిమా కోసం పడిన కష్టాన్ని దర్శక, నిర్మాతలు పంచుకున్నారు. బాహుబలికి పెట్టిన బడ్జెట్ లో 95 శాతం మూవీ ప్రొడక్షన్ కోసం వెచ్చించారంట.

వ్యక్తిగత ఖర్చులని వీలైనంత వరకు ప్రతి ఒక్కరు తగ్గించుకున్నారంట. మహాబలేశ్వరంలో షూటింగ్ కోసం విమానంలో వెళ్లాల్సి వచ్చింది. దానికోసం అందరూ ఎకనామిక్ క్లాస్ లోనే ప్రయాణం చేశారంట. అలాగే అక్కడ షూటింగ్ జరిగినంత కాలం సాధారణ హోటల్స్ లోనే స్టే చేశారంట. రాజమౌళి కూడా పెద్దగా సౌకర్యాలు లేని గదిలో ఉన్నారంట. అయితే మూవీ అవుట్ పుట్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదంట. షూటింగ్ జరిగినంత కాలం సాధారణ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే అందరూ తీసుకున్నారంట. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కి కంటెంట్ చూపించారంట.

అతనికి మూవీ నచ్చడంతో హిందీలో రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. అలా ఫైనల్ గా థియేటర్స్ లోకి వచ్చిన మొదటి రోజు బాహుబలి డివైడ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే మెల్లగా ప్రేక్షకులు ఈ చిత్రానికి కనెక్ట్ అయ్యారని మోడ్రన్ మాస్టర్స్ డాక్యుమెంటరీలో తెలియజేశారు. లాంగ్ రన్ లో బాహుబలి 1 650 కోట్ల కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అందుకొని రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా సక్సెస్ తో బాహుబలి 2 పైన ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇక ఆ సినిమా 2 వేల కోట్ల మార్క్ ను అందుకుంది. రాజమౌళి పేరు కూడా దేశవ్యాప్తంగా వినిపించడం మొదలైంది.

Tags:    

Similar News